ఈనాడులో గ‌బ్బిలాల కంపు

ఈనాడులో గ‌బ్బిలాల కంపు

ఇంటి పేరు కస్తూరివారు ఇళ్లంతా గబ్బిలాల కంపు అని సామెత‌. మీడియా మొఘ‌ల్ అని త‌న‌కు తాను జ‌బ్బ‌లు చ‌రుచుకునే ఈనాడు అధినేత రామోజీరావు ప‌త్రిక అద్యంతం తెలంగాణ మీద వ్య‌తిరేక‌త‌, తెలంగాణ మీద ద్వేశం, తెలంగాణ అంటే అసూయ నింపుకుని విష‌పు రాత‌లు రాస్తూ సామెత మాదిరిగానే గ‌బ్బిలాల కంపు కొడుతోంది. తెలంగాణ – ఆంధ్రా విడిపోయిన త‌రువాత పాల‌న విష‌యంలో ఆంధ్రాలో చంద్ర‌బాబు నాయుడు అన్నింటా విఫ‌ల‌మ‌య్యాడు. తెలంగాణ‌లో కేసీఆర్ స‌మ‌ర్ధ నాయ‌క‌త్వంలో తెలంగాణ అన్ని రంగాల‌లో ముందుకువెళ్తుంది. ఆంద్రాలో చంద్ర‌బాబు నాయుడు వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చే ఈనాడు రామోజీరావు తెలంగాణ‌లో మాత్రం ప్ర‌భుత్వ విజ‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టి రంధ్రాన్వేష‌ణ చేసి చిన్న చిన్న అంశాల‌ను భూత‌ద్దంలో పెట్టి ప్ర‌భుత్వం మీద ప్ర‌జా వ్య‌తిరేక‌త పెంచే ప్ర‌య‌త్నం, అనుమానాలు రేకెత్తించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు.

ఆంధ్రా ఆధిప‌త్యాన్ని దాటుకుని తెలంగాణ ఏర్ప‌డింద‌న్న ఆక్రోషం, కింద‌ప‌డ్డా మీది చేయి మాదే అన్న అహంకారం కొద్దీ రామోజీరావు లాంటి ఎంద‌రో తెలంగాణ మీద విషం నింపుకున్న వారే. దాన్ని సంధ‌ర్భాల కొద్దీ క‌క్కుతున్న వారే. అయితే ఏర్పాట‌యిన తెలంగాణ‌ను అభివృద్ది ప‌థంలో తీసుకువెళ్లాలి అన్న ఆలోచ‌న‌తో ఎవ‌రినీ నొప్పించ‌కుండా ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంద‌రికీ స్నేహ‌హ‌స్తం అందించి స‌హ‌క‌రించాల‌ని పెద్ద మ‌న‌సుతో కోరారు. కానీ కుక్క‌తోక వంక‌ర అన్న‌ట్లు రామోజీరావు వంక‌ర ఆలోచ‌న‌లు మానుకోలేదు. ఆ ఆలోచ‌న‌ల‌కు ప‌రాకాష్ట ఈ రోజు ఈనాడు దిన‌ప‌త్రిక‌లో రాసిన క‌థ‌నం. ఒంటిమిట్ట సీతారాముల వారి క‌ళ్యాణంలో వ‌ర్షం మూలంగా న‌లుగురు మ‌ర‌ణించ‌డం, 60 మంది గాయ‌ప‌డ‌డం జ‌రిగింది. చంద్ర‌బాబు నాయుడు ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్నారు. అక్క‌డి అధికార వ్య‌వ‌స్థ పూర్తిగా విఫ‌ల‌మై ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడింది.

అయితే అక్క‌డి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చ‌డం, ప‌నిలోప‌నిగా తెలంగాణ మీద‌ విషం క‌క్క‌డం స్వామికార్యం .. స్వ‌కార్యం అన్న‌ట్లు ఒంటిమిట్ట విషాదం భ‌ద్రాద్రికీ పాఠ‌మే అంటూ ఓ క‌థ‌నం వండి వార్చారు. రాసిన స‌న్నాసి జ‌ర్న‌లిస్టుకు సోయిలేదు వేసిన స‌బ్ ఎడిట‌ర్, సంబంధిత ఇంఛార్జ్ ల‌క‌న్నా ఏం రాశారు అన్న సోయి ఉండాలి. తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. అధికారం లేక ముందే టీఆర్ఎస్ పార్టీ గ‌త 18 ఏండ్లుగా ఎన్నో బ‌హిరంగ‌స‌భ‌లు నిర్వ‌హించింది. 2010 నాటికే టీఆర్ఎస్ పార్టీ ప‌రంగా దాదాపు 200 బ‌హిరంగ‌స‌భ‌ల‌ను నిర్వ‌హించింది. ఇక 2010 డిసెంబ‌ర్ 15న 15 ల‌క్ష‌ల మందితో ఓరుగ‌ల్లు మ‌హాగ‌ర్జ‌న ఓ చారిత్ర‌క స‌న్నివేశం అయితే గ‌త ఏడాది నిర్వ‌హించిన ప్ర‌గ‌తిగ‌ర్జ‌న మ‌హాస‌భ మ‌రో రికార్డు. పార్టీ ప‌రంగా స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించినా, ప్ర‌భుత్వ‌ప‌రంగా నిర్వ‌హించినా ప‌క‌డ్భంధీ ప్ర‌ణాళిక‌తో నిర్వ‌హించ‌డం, కిందిస్థాయి ఏర్పాట్ల‌ను కూడా స‌మీక్షించ‌డం ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అల‌వాటు.

గ‌త నాలుగేళ్లుగా తెలంగాణ‌లో ప్ర‌భుత్వం అధికారం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి భ‌ద్రాచ‌లంలో అనేక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌తిసారి క‌ళ్యాణోత్స‌వానికి ప్ర‌భుత్వం ప‌కడ్భంధీ ఏర్పాట్లు చేసింది. ఎక్క‌డా ఎన్న‌డూ అపశృతి జ‌ర‌గ‌లేదు. మొన్న‌టికి మొన్న జ‌రిగిన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు ఎంత విజ‌య‌వంతంగా పూర్త‌య్యాయో అందరికీ తెలిసిందే. ఒంటిమిట్ట‌లో ఏదో జ‌రిగింద‌ని అదే భ‌ద్రాచలానికి పాఠ‌మ‌ని ఈనాడు ప‌త్రిక కాల‌జ్ఞానం చెబితే అది రామోజీరావు అజ్ఞానానికి, ఈనాడు దిన‌ప‌త్రిక అవివేకానికి తార్కాణంగా నిలుస్తుంది త‌ప్పితే దానిని ప్ర‌జ‌లు ఆమోదించ‌రు అన్న‌ది గుర్తుంచుకోవాలి.

చంద్ర‌బాబు మీద ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను బ‌య‌ట‌ప‌డ‌కుండా చేసే ప్ర‌య‌త్నంలో ఆంద్రా జ‌నాల‌ను మోసం చేస్తూ .. పుట్టిన గ‌డ్డ‌కు ద్రోహం చేస్తున్న రామోజీరావు తెలంగాణ విష‌యంలో మాత్రం త‌న గుడ్డి వ్య‌తిరేక‌త‌ను మానుకోవ‌డం లేదు. తెలంగాణ ప్ర‌జ‌ల మంచిత‌నాన్ని చేత‌గానిత‌నంగా భావించి నిత్యం విషం క‌క్కే కార్య‌క్ర‌మాన్ని మార్చుకోకుంటే ఈనాడు లాంటి ఆంధ్రా ప‌త్రిక‌ల‌కు, మీడియాకు ఖ‌చ్చితంగా ఉద్య‌మంలో మాదిరి బుద్దిచెప్పే రోజు వస్తుంద‌న్న‌ది స్ప‌ష్టం.

(Visited 1,170 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *