క‌న‌క‌పు సింహాస‌న‌మున ..

క‌న‌క‌పు సింహాస‌న‌మున ..

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ

ఆంధ్రా మీడియాకు ఈ ప‌ద్యం అతికిన‌ట్లు స‌రిపోతుంది. 14 ఏండ్లు తెలంగాణ ఉద్య‌మం సాగితే ఉద్య‌మం బ‌ల‌ప‌డిన‌న్ని రోజులు కేసీఆర్ నాయ‌క‌త్వం మీద‌, వ్య‌క్తిగ‌త విష‌యాల మీద ప్ర‌జ‌ల‌కు అనుమానాలు రేకెత్తించే అంశాలు, కేసీఆర్ స్థ‌యిర్యాన్ని దెబ్బ‌తీసి త‌ద్వారా ఉద్య‌మం నీరుగారేలా విష‌పూరిత రాత‌లు .. అంతులేని కుట్ర‌లు. ఉద్య‌మం బ‌ల‌ప‌డిన త‌ర్వాత తెలంగాణ రాద‌ని ప్ర‌చారం చేస్తూ ఆంధ్రా పార్టీల‌ను ఉసిగొల్పి త‌ల‌తిక్క వాద‌న‌తో మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టి ప్ర‌జ‌లు ఉద్య‌మ‌కారుల స్థ‌యిర్యం దెబ్బ‌తీసి యువ‌త ఆత్మ‌హత్య‌లు చేసుకునే దిశ‌గా పురిగొల్పారు. తెలంగాణ ఏర్ప‌డిన వెంట‌నే తెలంగాణ ప్ర‌భుత్వం మీద చిల్ల‌ర ప్ర‌చారాలు, ఆంధ్రాలో స‌మ‌స్య‌లు ప‌క్క‌న‌పెట్టి తెలంగాణ స‌మ‌స్య‌ల‌కు బ్యాన‌ర్లు క‌ట్టి ప్ర‌చారం. ఓటుకునోటు కేసుతో బాబు ఆంధ్రాకు పోయాక ఈ ఆంధ్రా మీడియా ఆగ‌డాలు కాస్త ఆగాయి.

అయితే ఉద్య‌మంలో, ఉద్య‌మం త‌రువాత కూడా ఈ మీడియా తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించింది ఏమీ లేదు. అయినా ఏండ్ల త‌ర‌బ‌డి పాతుకుపోయిన మీడియా .. ఇప్ప‌టిక‌యినా మార‌క‌పోతుందా అన్న ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అవ‌కాశం ఇచ్చి ఉంటారు. కానీ కేసీఆర్ ఎంత ఉన్న‌త ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నా ఆంధ్రజ్యోతి, ఈనాడు ప‌త్రిక‌లు మాత్రం త‌మ శున‌క‌బుద్దిని బ‌య‌ట‌పెట్టుకుంటూనే ఉన్నాయి. టీడీపీ – బీజేపీ విడిపోయాక ఈ టీడీపీ ఆస్థాన పత్రిక‌ల పిచ్చి మ‌రింత ముదిరింది అని చెప్పాలి. నాలుగేండ్లు ఎన్డీఎలో అధికారం పంచుకుని నిధులు తెచ్చుకుని విచ్చ‌ల‌విడిగా వెన‌కేసుకున్న చంద్ర‌బాబు రేపు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు చూయించుకునేందుకు ఏమీ లేదు. అందుకే బీజేపీ నుండి వైదొలిగి దుమ్మెత్తిపోస్తున్నాడు. కేంద్రం ఇచ్చిన డ‌బ్బుల‌కు లెక్క‌లు మాత్రం లేవంటున్నాడు.

అవినీతి చంద్ర‌బాబు వితండ‌వాదానికి అనుకూలంగా ఈ రామోజీరావు, రాధాకృష్ణ‌ల బ్యాండ్ బృందం క‌థ‌నాలు వండి వారుస్తోంది. కానీ తెలంగాణ‌లో వాస్త‌వంగా జ‌రుగుతున్న అభివృద్దిని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌క‌ల‌జ‌నుల సంక్షేమానికి తీసుకుంటున్న చ‌ర్య‌లు ఈ మీడియాకు కాన‌రావ‌డం లేదు. ముఖ్య‌మంత్రి ఎంత పిలిచి మ‌రీ ఈ మీడియాను సింహాస‌నం ఎక్కించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా ఉద్య‌మంలో, ఉద్య‌మం త‌రువాత ఈ మీడియా మాత్రం త‌మ కుక్క‌బుద్దిని చాటుకుంటుంది.

తాజాగా తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గాయ‌ని కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి రాధామోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా వెల్ల‌డించారు. తెలంగాణలో 2015 లో 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 2016లో ఆ సంఖ్య 645కు పడిపోయిందని, ఇది 53.9 శాతం తగ్గుదల అని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో 2015లో 1491 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, 2016 లో 145.4% ఎక్కువగా ఆ సంఖ్య 3,661కి పెరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 2015లో 1569 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 2016లో 32.5 శాతం ఎక్కువగా 2079 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల సంఖ్య తెలంగాణలో కూడా భారీగా తగ్గింది. 2014లో 449 మంది ఆత్మహత్యలు చేసుకుంటే 2015లో 42, 2016లో 13 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని వెల్ల‌డించారు.

అయితే ఇంత ప్రాధాన్య‌త క‌లిగిన వార్త ఈనాడులో గానీ, ఆంధ్ర‌జ్యోతిలో గానీ అస‌లు ప్ర‌చుర‌ణ‌కే నోచుకోలేదు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో మాస్ కాపీ, బోర్లు ప‌డ‌లేదు అన్న వార్త‌ల‌ను ఆంద్ర‌జ్యోతి బ్యాన‌ర్ వేసుకుంటే, తెలంగాణ‌కు సంబంధంలేని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ప‌ద‌వీ విర‌మ‌ణ వార్త‌, జుక‌ర్ బ‌ర్గ్ క్ష‌మాప‌ణ వార్త‌, రుణాలు చెల్లించ‌లేని సంస్థ గురించి మ‌రో వార్త బ్యాన‌ర్ వార్త‌లుగా వేసుకుని ఈనాడు సంతృప్తి చెందింది. కానీ ఎక్క‌డ కూడా కేంద్రం తెలంగాణ ప్ర‌భుత్వం గురించి చెప్పిన వార్త‌ను ప్ర‌చురించ‌లేదు. ఆంధ్రా మీడియా, ఆంధ్రా పెట్టుబ‌డిదారి, రాజ‌కీయ కుట్ర‌ల‌ను చేధించి నాలుగేండ్ల‌లోనే కేసీఆర్ దేశ‌వ్యాప్తంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు అందుకునే జ‌న‌రంజ‌క‌పాల‌న అందిస్తున్నారు. అటు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న చంద్ర‌బాబు అవినీతికి త‌లుపులు తెరిచి ఆంధ్రాను నిండా ముంచాడు. 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ ఆంధ్రా మీడియా తెలంగాణ విజ‌యాల‌ను ప్ర‌పంచానికి తెలియ‌కుండా చేయ‌డ‌మే కాకుండా విషం చిమ్మే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి. తెలంగాణ వాదులు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంత‌యినా ఉంది.

 

(Visited 569 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *