కేసీఆర్ కు కేంద్రం కితాబు

కేసీఆర్ కు కేంద్రం కితాబు

ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభు త్వం రైతులకు మేలు చేసే ఎన్నో వ్యవసాయానుకూల నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా తెలంగాణ రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి . కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ పార్లమెంట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం 2015 లో తెలంగాణాలో 1400 మంది రైతు లు ఆత్మహత్య చేసుకుంటే 2016 లో ఆ సంఖ్య 645 కు పడిపోయింది . అంటే ఇది 53 .9 % తగ్గుదల . రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గిన రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది . రైతుల ఆత్మహత్యలు భారీగా పెరిగిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ర్ట, కాంగ్రెస్‌పాలిత కర్ణాటక ఉన్నాయి.మహారాష్ర్టలో 2015 లో 1491 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2016 లో ఆ సంఖ్య 3661 కి పెరిగింది.ఇది 145.4 % ఎక్కు వ.

ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 2015 లో 1569 ఉంటే 2016 లో ఆ సంఖ్య 2079 కి పెరిగిం ది. ఇది32.5%ఎక్కువ . ఇక వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల విషయంలోనూ తెలంగాణ లో భారీ తగ్గుదల ఉంది. 2014లో 449 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఆసంఖ్య 2015లో42కు, 2016 లో 13కు తగ్గిపోయింది. తెలంగాణలో రైతులు, వ్యవసాయకార్మికుల ఆత్మహత్యలు భారీగా తగ్గుముఖం పడుతుండడానికి ప్రధాన కారణం సిఎం కెసిఆర్ రైతుల కష్టాలు, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు అంకురార్పణ చేయడమే.

లక్ష కోట్ల తో సాగు నీటి ప్రాజెక్టులు చేపట్టడం, ఏటా 5 వేల కోట్లతో 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం, ఈ ఏడాది రైతులకు ఎకరానికి రూ .8 వేల పంట పెట్టుబడి అందించడానికి ఈ బడ్జెట్ లోనే రూ. 12000 కోట్లు కేటాయించడం, ఇంకా మార్కెట్ గోడౌన్ల నిర్మాణాన్ని రూ.1000 కోట్లతో చేపట్టడం , డ్రిప్ ఇరిగేషన్ సదుపాయానికి 75 నుండి 90 శాతం వరకు సబ్సిడీ ఇవ్వడం , పాలీ హౌజ్ సబ్సిడీ , సమయానికి ఎరువులు , విత్తనాలు సరఫరా చేయడం వంటి అనేక విప్లవాత్మక చర్యలు తీసుకోవడంతో పాటు ఆసరా, కళ్యాణ లక్ష్మి , ఫీజు రీయంబర్స్ మెంట్ , ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో రైతులు వ్యవసాయ కార్మికుల్లో దైర్యం పెరిగింది . తెలంగాణ లో సాగు నీటి ప్రాజెక్టులు వేగంగా చేపడుతుండడం వల్ల వ్యవసాయ భూముల ధరలు కూడా గతంలో కంటే నాలుగు , అయిదు రెట్లు పెరిగినయి . దీంతో సుమారు 60 లక్షల రైతు కుటుంబాలు తమకు మంచి భవిష్యత్ ఉందని విశ్వసిస్తున్నయి . తెలంగాణ లో సాగు నీటి ప్రాజెక్టులు ఈ రెండేళ్లలో పూర్తయి ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు గంటున్న కోటి ఎకరాల సాగు సంకల్పం నెరవేరితే భవిష్యత్తులో తెలంగాణలో రైతులు , కూలీల ఆత్మహత్యలు జరిగే అవకాశమే లేదు .

సోర్స్ – మ‌న తెలంగాణ దిన‌ప‌త్రిక సౌజ‌న్యంతో

(Visited 150 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *