పున‌ర్నిర్మాణానికి మీ అండ కావాలి

పున‌ర్నిర్మాణానికి మీ అండ కావాలి

14 ఏండ్ల సుధీర్ఘ పోరాటంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల కనుల పంట ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త నాలుగేండ్లుగా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు, అమ‌రులు క‌ల‌గ‌న్న తెలంగాణ పున‌ర్నిర్మాణం కోసం చిత్త‌శుద్దిగా ప‌నిచేస్తున్నార‌ని, వివిధ దేశాల‌లో స్థిర‌ప‌డిన తెలంగాణ ఎన్నారైలు తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌ని తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్, రామ‌గుండం ఎమ్మెల్యే సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన ఆయ‌న‌తో ఎన్నారైలు టీఆర్ఎస్ యూఎస్ఎ ఆధ్వ‌ర్యంలో మీట్ & గ్రీట్ స‌మావేశం నిర్వ‌హించారు. సున్నీవేల్, కాలిఫోర్నియాలో జ‌రిగిన ఈ స‌మావేశానికి పూర్ణ‌చంద‌ర్ బైరి, అభిలాష్ రంగినేనిలు స‌భాధ్య‌క్షత వ‌హించారు.

ఈ సంధ‌ర్భంగా సోమార‌పు సత్య‌నారాయ‌ణ మాట్లాడుతూ అర‌వైఏండ్ల స‌మైక్య‌పాల‌న‌లో సాగు తాగునీటీ వ‌న‌రుల‌కు దూర‌మ‌యిన తెలంగాణ రాష్ట్రాన్ని స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు, త‌ద్వారా 80 శాతం గ్రామీణ ప్రాంతాల‌ను అభివృద్ది వైపు న‌డిపించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయ‌డం ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నార‌ని, అయితే ఈ ప్రాజెక్టుల‌కు తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీలు కోర్టుల‌లో కేసులు వేస్తూ అడ్డుప‌డుతుండ‌డం బాధాక‌రం అని అన్నారు. దేశంలోనే అత్య‌ధికంగా 40 వేల కోట్ల రూపాయ‌ల‌తో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం విద్య‌కు పెద్ద‌పీట వేసి భారీ ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి భావి తెలంగాణ పౌరుల‌ను త‌యారు చేస్తుంద‌ని అన్నారు. గ‌త అర‌వైఏండ్ల‌లో ఏర్పాట‌యిన గురుకులాల‌కు రెట్టింపు గురుకులాలు ఈ నాలుగేళ్ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింద‌ని, ప్ర‌ణాళికాబ‌ద్దంగా కార్పోరేట్ విద్య సామాన్యుల‌కు అందే విధంగా చ‌ర్య‌లు తీసుకుంద‌ని వివ‌రించారు.

మిష‌న్ భ‌గీర‌థ‌తో ఇంటింటికి తాగునీరు దేశంలోనే ఓ సంచ‌ల‌న ప‌థ‌కం అని, గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యానికి సాక్ష్యంగా నిలిచిన చెరువుల‌ను మిష‌న్ కాక‌తీయ‌తో పున‌రుద్ద‌రించ‌డం మూలంగా తెలంగాణ‌లో ఆ ఫ‌లాలు అప్పుడే ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయ‌ని, ప్రాజెక్టుల నీటితో చెరువుల‌ను నింప‌డం మూలంగా రైతుల‌కు, వాటి మీద ఆధార‌ప‌డిన ఇత‌ర వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు లాభ‌దాయంగా ఉంటుంద‌ని అన్నారు. తెలంగాణ‌లో వైద్య స‌దుపాయాల తీరును స‌మూలంగా మార్చేసి కేసీఆర్ ప్ర‌భుత్వం పేద‌ల‌కు మేలు చేస్తుంద‌ని, ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో కూడా ఏర్పాటు చేసిన అత్యంత ఆధునిక డ‌యాల‌సిస్ సేవ‌ల మూలంగా సామాన్యుల‌కు కార్పోరేట్, హైద‌రాబాద్ లోని ఆసుప‌త్రుల చుట్టూ తిరిగే దుస్థితి త‌ప్పింద‌ని, ఆన్ లైన్ లో న‌మోదు చేసుకుంటే వారు ఇచ్చిన స‌మయానికి వెళ్తే ఉచితంగా డ‌యాల‌సిస్ చేసుకుని తిరిగి రాత్రికి సంబంధిత రోగి ఇంటికి చేరుకోవ‌చ్చ‌ని అన్నారు. ఇక ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు వెళ్లి నిలువు దోపిడీకి గురికావ‌డ‌మే కాకుండా అన‌వ‌స‌ర శ‌స్త్ర‌చికిత్స‌ల‌తో అనారోగ్యం పాల‌వుతున్న గ‌ర్భిణుల‌కు అండ‌గా కేసీఆర్ కిట్ ప‌థ‌కం ఊర‌ట‌నిస్తుంద‌ని, ఉచితంగా కాన్పులు చేయ‌డ‌మే కాదు, ఆడ‌బిడ్డ‌ల‌కు న‌గ‌దు సాయం అంద‌జేసి అండ‌గా నిలుస్తున్న ఈ ప‌థ‌కం సామాన్య కుటుంబాల‌కు ఎంతో ఆస‌రా అని సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఇక రైతుల‌కు 24 గంట‌ల ఉచిత విద్యుత్, గృహాల‌కు 24 గంట‌ల విద్యుత్, ఇప్పుడు రైతుల‌కు పంట పెట్టుబ‌డుల ప‌థ‌కం, రూ. అయిదు ల‌క్ష‌ల భీమా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అన్ని రంగాల మీద ఉన్న సూక్ష్మ‌దృష్టికి నిద‌ర్శ‌నం అని అన్నారు. అందుకే జ‌న‌రంజకంగా ఉన్న కేసీఆర్ పాల‌న‌కు ఎన్ఆర్ఐలు అండ‌గా నిల‌వాల‌ని కోరారు.

ఈ కార్యక్రమం వియజయవంతం కావడానికి స‌హ‌క‌రించిన‌ పూర్ణచందర్ బైరి, అభిలాష్ రంగినేని, రిషికేష్ రెడ్డి, రజినికాంత్ కొసనం, నవీన్ జలగం చరణ్ రెడ్డి, శేషి దొంతి,తేజస్వి వద్దిరాజ్, భాస్కర్ మద్ది, శివ కాలేరు, రాజ్ భవాని, శ్రీనివాస్ పొన్నాల, సాగర్ కొత్త, శశాంక్ సిరిపురం, రామ్ వాలా, ,ఉదయ్ జొన్నల త‌దిత‌రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

(Visited 433 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *