గురి త‌ప్ప‌ని విలుకాడు

గురి త‌ప్ప‌ని విలుకాడు

మనం ఎక్కడినుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తు న్నాం? ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏంచేయాలి? సరిగ్గా గమనిస్తే పవిత్ర గ్రంథం భగవద్గీత సారాంశం ఇదే. ప్రజల నుంచి ఎన్నికైన ఏ నాయకుడైనా, ప్రజల కోసం పనిచేస్తున్నాననుకునే ఏ నేత అయినా ఈ ప్రశ్నలు వేసుకుంటే చాలు అత ని నుంచి ప్రజలకు, ఆ సమాజానికి మేలు జరిగినట్లే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టమైన లక్ష్యం ఉన్నది. ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పం ఉన్నది. అందుకే ఆయన ఏ అడుగు వేసినా దానికి తగ్గ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది.

2001లో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ప్రయ త్నం కేవలం రాజకీయ ప్రయోజనమే అని అంతా భావించారు. అయితే ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే తనకు ముఖ్యం అని, తెలంగాణ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టంగా చెబుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా తేలికైన విషయం కాదని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే అన్ని పార్టీలను ఒప్పించి సాధించాల్సిన అంశమని తేల్చిచెప్పారు. ఢిల్లీలో, తెలంగాణలో ఉన్న పార్టీలను ఒప్పించడం, ప్రజలను చైతన్యం చేయడం వంటి ప్రయత్నాలతో ముందు కువెళ్లారు. అయితే తెలంగాణ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే అని భావించిన కొందరి మూలంగా ఉద్యమంలో ఎదురుదెబ్బ లు తగిలాయి, తప్పితే కేసీఆర్ ఎక్కడా విఫలం కాలేదు. ఇదే సమయం లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తదితర పార్టీలకు తెలంగాణ ఒక రాజకీయ ప్రయోజనం మాత్రమే తప్పితే తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి వారికి కనీస ప్రణాళిక, ఆలోచన లేదు. అందుకే కాంగ్రెస్, బీజేపీ లను ప్రజలు దూరం పెట్టి కేసీఆర్‌కు పట్టంకట్టారు.

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కేసీఆర్ వందశాతం విజయవంతం అయ్యారు. తెలంగాణ వస్తే బతుకులు అంధ కారం అవుతాయని ఆక్రోశించినవారు తలదించుకునేలా, తెలంగాణ ప్రజ లు సగర్వంగా తలెత్తుకునేలా నాలుగేండ్ల కేసీఆర్ పాలన విజయవంతం గా సాగుతున్నది. తెలంగాణకు పురిట్లోనే సంధికొట్టాలన్న వారి కుట్రలను బద్ద లుచేస్తూ కేసీఆర్ ముందుకుసాగుతున్నారు. గత 60 ఏండ్ల సీమాంధ్ర పాలనలో నష్టపోయిన తెలంగాణ వనరులను మల్లించే ప్రయత్నం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రజల జీవన ప్రమాణాల్లో సమూల మార్పులు తీసుకువచ్చే కూడు, గూడు, నీళ్లు అనే అంశాల మీద ఆయన దృష్టిసారించారు. ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలన్న సంకల్పంతో మిషన్ భగీరథ పథకం ప్రారంభించారు. రాష్ట్రంలోని 46,531 చెరువులను మిష న్ కాకతీయ ప్రాజెక్టులో భాగంగా ఐదేండ్లలో పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకొని గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా ధ్వంసమైన చిన్ననీటిపారుదల వ్యవస్థకు ఊపిరిపోసే దిశగా అడుగులువేశారు. ఇక తెలంగాణ దిశను సమూలంగా మార్చే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని, పాలమూరు-రం గారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 35,200 కోట్లతో నిర్మిస్తున్నారు.

ఇవి కాకుండా కొత్తగా సీతారామసాగర్‌ను రికార్డు సమయంలో నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతలను , మిడ్‌మానేరులను శరవేగంగా నిర్మాణంచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 14 ఏండ్ల పాటు తెలంగాణ సమస్యలను సమగ్ర అధ్యయనం చేసిన అవగాహన మూలంగానే కేసీఆర్ విజయవంతం కాగలిగా రు. ఇక రైతులకు పంట పెట్టుబడి,5 లక్షల జీవిత బీమా ఇవ్వడం ఒక సం చలనం. కొత్తగా పురుడుపోసుకున్న ఒక రాష్ట్రం ఇన్ని విజయాలు సాధించడం మామూలు విషయం కాదు. ఇతర రాష్ర్టాలే కాదు దేశమే తెలంగాణ పథకాల మీద దృష్టి సారిస్తున్నదంటే అర్థం చేసుకోవాలి. ఇన్ని లక్షల కోట్లతో ఇన్ని అభివృద్ధి పనులు ఈ నాలుగేండ్లలోనే ఎలా సాధ్యమ య్యా యి? ఎందుకు మొదలయ్యాయి? గత 60 ఏండ్ల సుదీర్ఘ పాలనలో ప్రజల కోసం ఏం చేశారు? అని ప్రశ్నిస్తే విపక్షాలకు చెప్పుకునేందుకు సమాధానం లేదు. అందుకే కేసీఆర్‌ను ప్రజలు విశ్వసిస్తున్నారు.

తాజాగా కేసీఆర్ దేశ రాజకీయాల మీద సరికొత్త ప్రశ్నలు సంధించడంతో సర్వత్రా కలకలం రేగుతున్నది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు పక్క దేశాలను చూడటం, వినడం.. మనం దేశం ఎప్పుడు అలా అవుతుందని ఎదురుచూడటం తప్పితే ఈ 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశ స్థితిగతులను మార్చాలని చేసిన ప్రయత్నాలు కనిపించవు. దివంగత ప్రధాని పీవీ హయాంలో చేపట్టిన సంస్కరణలు మినహాయిస్తే ఈ దేశ ప్రగతికి తోడ్పడిన ప్రణాళికలేమీ లేవు. సామాన్యుడి మదిలో మెదులుతు న్న ఈ ప్రశ్నలనే ఇప్పుడు కేసీఆర్ సంధించారు. కాంగ్రెస్ సుదీర్ఘ పాలన ను చూసిన ప్రజలు మోదీ మీద విశ్వాసంతో గెలిపించారు. మోదీ కూడా ఊహించని విధంగా తొలిసారి బీజేపీ కూటమికి మెజార్టీ సీట్లు ఇచ్చి ఆదరించారు.

ఈ దేశానికి ఇక కొత్త రోజులు ఖాయమని ప్రజలు భావించారు. కానీ ఈ నాలుగేండ్ల పాలనలో దేశంలో వచ్చిన సమూల మార్పులేమీ లేవు. నోట్లరద్దుతో రాత మారుతుందని చెప్పిన మోదీ అసలు బ్యాంకుల్లో నోట్లే దొరుకని పరిస్థితిని సృష్టించారు. బ్యాంకుల మీద నమ్మకం కోల్పోయిన ప్రజలు వాటిని ఇండ్లలో దాచుకోవడమో, భూములు కొనుక్కోవడమో చేస్తున్నారు తప్పితే బ్యాంకు వైపు వెళ్లే సాహసం చేయడంలేదు. ఇక అధికారంచేతిలో ఉంచుకునే ప్రయత్నాల్లో భాగంగా రాష్ర్టాలను కేంద్ర అజమాయిషీలోకి తీసుకొచ్చి రాష్ర్టాల వ్యవస్థను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది మోదీ ప్రభు త్వం. తమ అనుకూల రాష్ర్టాలకు తప్పితే ఇతర రాష్ర్టాలకు రావాల్సిన వాటాకు మించి కనీస ప్రోత్సాహం అందించ డం లేదు. ప్రజల జీవితాల్లో సమూల మార్పు తీసుకువస్తారనుకుంటే ఎన్ని రాష్ర్టాల్లో అధికారంలోకి వస్తున్నాం, ఎన్ని రాష్ర్టాలలో ఏ విధంగా అధికారాన్ని దక్కించుకోగలమనే లెక్కల్లోనే మోదీ ప్రభుత్వం మునిగిపోయింది.

తెలంగాణ ఆవిర్భవించిన వెంటనే ఏడు మండలాలను ఆంధ్రలో కలిపి తెలంగాణ పట్ల వివక్షను ప్రకటించిన కేంద్రంతో ఎలాంటి కయ్యాలకు దిగకుండా ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ ముందుకెళ్లారు. నోట్లరద్దుతో దేశం రూపురేఖలు మారుతాయంటే మంచిదే కదా అని మద్దతు ఇచ్చారు. జీఎస్టీతో మార్పు వస్తుందంటే దానికీ మద్దతు ఇచ్చారు. కానీ కేంద్రం మాత్రం తెలంగాణను చిన్నచూపే చూసింది. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం దేశంలోని అన్ని పార్టీలను కలిశారు. అందరు నేతలను సంప్రదించారు. తెలంగాణనే కాదు దేశంలోని అన్నిరాష్ర్టాల స్థితిగతుల మీద ఆయనకు పట్టున్నది. తెలుగు మాత్రమే కాదు ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలను ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. సామాన్యుడికి సైతం అర్థమయ్యేరీతిలో చెప్పగల సామ ర్థ్యం గల అరుదైన వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరు.

అందుకే ఈ దేశంలో రావాల్సిన సమూల మార్పుల గురించి ఆలోచిస్తున్నారు. అడుగులు వేస్తున్నా రు. మిగతా పార్టీలది అధికారం పొందాలన్న రాజకీయాలు తప్పితే ప్రజల కోసం చేసింది శూన్యం. 14 ఏండ్లు తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ ఇప్పుడు ఈ దేశంలో గుణాత్మకమార్పు రావాలన్న ఆకాంక్షతో ముం దుకు నడుస్తున్నారు. ఇంకా ఎన్నేండ్లు అమెరికా, చైనా గురించి చెప్పుకోవాలి. ఆ దేశాలు మన దేశాభివృద్ధిని చూసి చెప్పుకునే రోజులు రావాలని ప్రకటించారు. కేసీఆర్ ఏదీ మొదలుపెట్టినా అది ప్రజలకోసం. ఆ ప్రయత్నంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయరు. గమ్యం చేర డం ఆలస్యం కావచ్చేమో గానీ ఆయన గురి తప్పరనడానికి సాక్ష్యం ప్రత్యే క తెలంగాణ రాష్ట్రం, నాలుగేండ్ల తెలంగాణ పాలన.

సందీప్ రెడ్డి కొత్త‌ప‌ల్లి
న‌మ‌స్తె తెలంగాణ సౌజ‌న్యంతో

(Visited 165 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *