బే ఏరియా గులాబీ మయం

బే ఏరియా గులాబీ మయం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌లు అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్తలు, నేత‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని స‌న్నివేల్ లో జ‌న్మ‌దిన వేడుక‌ల సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. టీఆర్ఎస్ యూఎస్ఎ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల‌కు పెద్ద ఎత్తున అభిమానులు హాజ‌ర‌య్యారు. పూర్ణ బైరి, అనిల్ ఎర్ర‌బెల్లి ఆధ్య‌క్ష‌త‌న జ‌రిగిన వేడుక‌ల‌లో టీఆర్ఎస్ యూఎస్ఎ టీం ఎన్ఆర్ఐలు న‌వీన్, భాస్క‌ర్, అభిలాష్ రంగినేని, ర‌జ‌నీకాంత్, శ్రీ‌నివాస్, హృషికేష్, శివ‌, ఉద‌య్, హ‌రి, రామ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

అర‌వైఏండ్ల తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఆకాంక్ష‌ను 14 ఏండ్ల అవిశ్రాంత ఉద్య‌మంతో సాధించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడున్న‌రేండ్ల పాల‌న‌తో ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచార‌ని కొనియాడారు. స‌మైక్య పాల‌న‌లో ద‌గాప‌డ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ‌చిత్రాన్ని మూడేండ్ల‌లో వినూత్న ప‌థ‌కాల‌తో దేశంలోనే మిగ‌తా రాష్ట్రాల‌కు స్ఫూర్థిగా కేసీఆర్ నిలిచార‌ని అన్నారు. కాళేశ్వ‌రం, పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టులు, మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ ప‌థ‌కాలు, టీఎస్ ఐపాస్, టీ హ‌బ్ లు ప్ర‌పంచవ్యాప్తంగా అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయ‌ని, పాల‌న రాదు అని ఉద్య‌మంలో అవ‌మానించిన వారే ఔరా అని ఆశ్చ‌ర్య‌పోయే విధంగా పాల‌న సాగిస్తున్న ముఖ్య‌మంత్రికి తెలంగాణ రుణ‌ప‌డి ఉంటుంద‌ని అన్నారు.

కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌ల నేప‌థ్యంలో బే ఏరియా అంతా గులాబీమ‌యంగా మారింది. అభిమానులు, కార్య‌క‌ర్త‌ల జ‌య‌హో కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు, కేరింత‌ల న‌డుమ కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలుపుకున్నారు.

(Visited 246 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *