కార్యసాధకుడు మన కేసీఆర్

కార్యసాధకుడు మన కేసీఆర్

అద్భుతాలను కలగనడం ఆయన హాబీ! వాటిని అవలీలగా సాకారం చేసేయడం ఆయన ైస్టెల్! అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఆయనకలవాటు! ముళ్లూరాళ్లూ అవాంతరాలున్న బాటలను ముచ్చటైన రహదారులుగా తీర్చిదిద్దే కార్మికుడు! తెలంగాణపై ఆపేక్ష.. తెలంగాణకు రక్ష.. బంగారు తెలంగాణ నిర్మాణానికి సంకల్పం తీసుకున్న దక్ష! కేసీఆర్! మూడక్షరాల పేరున్న తెలంగాణ మహర్షి! ఉచ్ఛాసనిశ్వాసల్లో తెలంగాణనే నింపుకొన్న నిలువెత్తు మూర్తిమత్వం! గిట్టనిశక్తులు విమర్శలను, విషాగ్నులను కురిపిస్తున్నా.. బెదరక, సడలక ముందుకు సాగుతున్న ధీరుడు! లక్ష్యసాధన కోసం మృత్యువునే ముద్దాడేందుకు తెగించి.. సాధించిన సాహసి.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు!! ఆయన కృషికి సాక్ష్యమే నేటి స్వేచ్ఛా తెలంగాణం! ఆయన త్యాగానికి రూపమే నేటి స్వరాష్ట్రం! యాచించే స్థితి నుంచి.. శాసించుకునే స్థాయికి కష్టపడి తెచ్చిన తెలంగాణను ఇష్టపడి చేస్తున్న అభివృద్ధి! అందుకు ఉదాహరణలే.. స్ఫూర్తిదాయకంగా పూర్తవుతున్న కాళేశ్వరం సహా సాగునీటి దేవాలయాలు.. గంగాళాలుగా మారి జలకళ సంతరించుకుంటున్న కాకతీయ చెరువులు.. ఫ్లోరైడ్ రక్కసిని వెక్కిరిస్తూ భగీరథ ప్రయత్నంతో ఇంటింటికీ అందుతున్న స్వచ్ఛమైన తాగునీళ్లు.. హరితహారంతో పరుచుకుంటున్న పచ్చదనం.. భద్రంగా శాంతిభద్రతలు.. మళ్లీ పరిశ్రమల కోలాహలం.. వెల్లువలా పెట్టుబడుల జాతరలు.. విశిష్ట అంతర్జాతీయ సదస్సుల తళుకులు.. ఐటీ మెరుపులు.. రాష్ట్రమంతటా నిరంతర విద్యుత్ ధగధగలు.. అబ్బురపడిన దేశవిదేశీ నేతల ప్రశంసలు!

నాలుగు కోట్ల మందికేకాదు.. నలుగురు బడుగులకు ప్రయోజనం కల్పించేదైతే చాలు.. పదిమందికీ పనికొస్తుందంటే చాలు.. చేసి తీరాలన్న తపన! నాటి ఉద్యమ నినాదాలకు వాస్తవరూపం కల్పించాలన్న ఆర్తి! భావి సమాజం భద్రంగా ఉండాలన్నదే ఆలోచన! గోసపడుతున్న కుటుంబాలకు ఆయన పెద్ద దిక్కు!! అందుకు తార్కాణాలే సబ్బండవర్ణాలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు.. ఆసరాగా నిలుస్తున్న పింఛన్లు.. వినూత్నంగా ప్రకటించిన పంట పెట్టుబడి పథకం.. తల్లీపిల్లల క్షేమాన్ని కాంక్షించే కేసీఆర్ కిట్లు.. ఒంటరి మహిళలకు భృతి.. గుప్పైడు మందే ఉన్నా, బోదకాలు బాధితులకు అండదండలు.. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే డబుల్ బెడ్‌రూం ఇండ్లు.. విద్యార్థులకు సన్నబియ్యం అన్నాలు.. ఉద్యోగార్థులకు ఎడతెగక విడుదలవుతున్న కొలువుల భర్తీ నోటిఫికేషన్లు!! గొర్రెల పంపకాలు.. చేపల పెంపకాలు.. మగ్గాలకు వెన్నుదన్నులు.. నాయీబ్రాహ్మణులకు నవీన సదుపాయాలు.. హోంగార్డులకు వరాలు.. ఉద్యోగులకు పీఆర్సీలు.. ఒకటారెండా.. ప్రతి వృత్తి.. ప్రతి కులవృత్తి వికసించాలని.. విలసిల్లాలని తపిస్తున్న అచ్చ తెలంగాణ హృదయం! ఒకప్పటి వలసల కేంద్రాలను పాడిపంటలకు పసిడిరాశులకు నిలయాలను చేసి.. తిరుగువలసలకు దారులుతీసిన వ్యూహకర్త! తెలంగాణ సంపదను, సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సమైక్య పాలన చేసిన గాయాన్ని ఓర్పుతో మాన్పుతున్న నేర్పరి!

అభివృద్ధి అంటే దశాబ్దాలతరబడి సాగే దుస్సంప్రదాయాలను కూకటివేళ్లతో పెకిలించి.. మూడున్నరేండ్లలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి పర్యాటకానికి ఆదర్శంగా నిలిపి, అధ్యయనాంశంగా మార్చిన కార్యసాధకుడు మన కేసీఆర్! విధానాలకు సామాజిక దృక్పథాన్నద్ది.. పాలనకు మానవీయకోణం జోడించి.. కొత్త, చిన్న రాష్ర్టాన్ని దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని సాక్షాత్తూ కేంద్రమంత్రుల నోట పలికించిన అపూర్వనేత.. జననేత.. తెలంగాణ జాతిపితకు.. పుట్టిన రోజు సందర్భంగా సమస్త తెలంగాణం నమస్తే అంటూ హృదయపూర్వకంగా అందిస్తున్న శుభాకాంక్షలివి!

న‌మ‌స్తె తెలంగాణ దిన‌ప‌త్రిక సౌజ‌న్యంతో

(Visited 97 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *