సామాజిక రుగ్మ‌త‌ల‌పై అఖిలేష్ అస్త్రం

సామాజిక రుగ్మ‌త‌ల‌పై అఖిలేష్ అస్త్రం

దేశంలో నెల‌కొన్న పేద‌రికం, మ‌హిళ‌ల మీద హింస‌, నాణ్య‌మైన‌ విద్య‌, వైద్యం, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం, సుర‌క్షిత నీరు వంటి 17 సామాజిక రుగ్మ‌త‌లు, అవ‌స‌రాల మీద భావి పౌరుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ యువ‌కుడు న‌డుంక‌ట్టాడు. దేశం త‌ర‌పున ఇప్ప‌టికే రెండు సార్లు ఐక్య‌రాజ్య‌స‌మితిలో నాయ‌క‌త్వం వ‌హించిన సింగిరెడ్డి అఖిలేష్ రెడ్డి అదే స్పూర్థితో గోల్స్ ఆన్ వీల్సీ నినాదంతో 100 రోజుల్లో ల‌క్ష మంది ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ను క‌లుసుకుని అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సిద్ద‌మయ్యాడు. ఇప్ప‌టికే యాబై వేల మందికి పైగా విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి ప్ర‌తిజ్క్ష చేయించాడు.

దేశం ముందున్న స‌వాళ్ల‌ను, సామాజిక రుగ్మ‌త‌ల‌ను భావి భార‌త పౌరుల‌కు వివ‌రించి వాటిని అదిగ‌మించడానికి వారికి కార్యాచ‌ర‌ణ‌ను అందిస్తున్నాడు అఖిలేష్ రెడ్డి. అత్య‌ధిక జ‌నాభాను క‌లిగిఉన్న భార‌త‌దేశం త్వ‌ర‌లో ప్ర‌పంచంలోనే యంగెస్ట్ కంట్రీగా నిల‌వ‌బోతుంది. ఈ నేప‌థ్యంలో యువ‌త‌కు దేశం మీద స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌, సామాజిక బాధ్య‌త క‌లిగి ఉంటే దేశం ప్ర‌పంచంలోనే అగ్ర‌స్థానానికి వెళ్తుంద‌ని అఖిలేష్ అంటున్నాడు.

త‌న‌తో క‌లిసి వ‌చ్చే యువ‌త‌, సంఘాల‌తో క‌లిసి భావి భార‌త పౌరులు తాను చేస్తున్న ఈ కార్య‌క్ర‌మంలో నిమ‌గ్నం అయ్యేలా చేసి భ‌విష్య‌త్ లో ప్ర‌పంచానికి కానుక‌గా అందించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. అనేక పాఠ‌శాల‌లో విద్యార్థుల‌తో క‌లిసిన త‌రువాత వారి నుండి అద్భుత స్పంద‌న వ‌చ్చింద‌ని, త‌న ల‌క్ష్యాన్ని చేరుకుంటాన‌న్న న‌మ్మ‌కం క‌లిగింద‌ని అఖిలేష్ వెల్ల‌డించారు. ఆయ‌న ల‌క్ష్యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ కోరుకుందాం.

(Visited 152 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *