2018

నిరంజ‌న్ రెడ్డి గెలుపు కోరుతూ యువ‌కుడి 20కె ర‌న్

తెలంగాణలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల‌ని, కేసీఆర్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావాల‌ని, వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి గెలిపించాల‌ని కోరుతూ పెబ్బేరు మండ‌లం అయ్య‌వారిప‌ల్లికి చెందిన‌ సొప్ప‌రి ప్ర‌కాష్ అనే యువ‌కుడు 20 కె ర‌న్ నిర్వ‌హించాడు. పెబ్బేరు ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం నుండి మొద‌లుపెట్టి వ‌న‌ప‌ర్తిలోని శ్రీ‌నివాస‌పురం ఆంజ‌నేయ స్వామి ఆల‌యం వ‌ర‌కు ఆగ‌కుండా ప‌రుగెత్తారు. వ‌న‌ప‌ర్తిలో టీఆర్ఎస్ శాస‌న‌స‌భ అభ్య‌ర్థి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి యువ‌కుడిని శాలువాతో స‌న్మానించి అభినందించారు. కారు గుర్తు ఉన్న టీ ష‌ర్టు, చేతిలో టీఆర్ఎస్ జెండాతో ప‌రుగెత్తుతూ దారి పొడ‌వునా వాహ‌న‌దారుల‌ను, ప‌లు గ్రామాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించారు. కేసీఆర్

ప్రజా పార్టీ

  ప్రజా పార్టీ తెలంగాణ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు…వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేదుకు ఆచరాణ సాధ్యమైన ఆలోచనలు..సమాజ శ్రేయస్సే కు పనికొచ్చే మ్యానిఫెస్టోతో ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంతో ప్రజా పార్టీని స్థాపిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయి… మళ్లీ కొత్తపార్టీ ఎందుకు అనే ప్రశ్న మీలో రావచ్చు. తెలంగాణ గడ్డమీద చదువు సంధ్యలు పూర్తి చేసుకుని..విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో సేవలు అందించి మళ్లీ పుట్టినగడ్డ రుణం తీర్చుకునేందుకు కొత్తపార్టీ స్థాపిస్తున్నాం. మన రాష్ట్రంలో పరిస్థితులు..ఇక్కడ ప్రజలు, పాలకులు వ్యవహారశైలి … వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు సమగ్రంగా అవగాహన చేసుకున్నాం.

కూట‌మి సీటులో విద్యార్థి ఓట‌మి

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా.. తెలంగాణ శౌర్యాన్ని చూపి న కాకతీయ.. నాటి, నేటితరం నాయకుల్లో ఎక్కువ మంది ఈ యూనివర్సిటీల్లో నాయకత్వలక్షణాలను పుణికిపుచ్చుకున్నవారే. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేకమంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేశారు. వారి త్యాగాలను గుర్తించిన టీఆర్‌ఎస్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో అనేకమంది విద్యార్థి సంఘం నాయకులకు రాజకీయంగా భరోసా కల్పించింది. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వడంతోపాటు, అధికారంలోకి వచ్చాక అనేక నామినేటెడ్ పోస్టుల్లోనూ వారికి అవకాశం కల్పించింది. కానీ, విద్యార్థి సంఘాలను రెచ్చగొడుతూ రాజకీయంగా సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి,

శ్రీశైలం కబ్జా

కృష్ణాజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరు శ్రుతి మించుతున్నది. కృష్ణా బోర్డు అండ చూసుకొని అడ్డగోలుగా రెచ్చిపోతున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇష్టానుసారంగా నీటిని తరలిస్తున్నా ఆ రాష్ట్రం జలదాహం మాత్రం తీరడం లేదు. మొత్తం శ్రీశైలం జలాశయాన్నే చెరబట్టి.. తెలంగాణ నీటి విడుదలను సైతం అడ్డుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా రెండురోజులుగా తెలంగాణకు విడుదల చేస్తున్న నీటిని వెంటనే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ కృష్ణాబోర్డుకు లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అనుమతి లేకుండా వంద టీఎంసీలకుపైగా నీటిని తరలించుకుపోవడమే కాకుండా తెలంగాణకు వాస్తవంగా రావాల్సిన నీటిని నిలిపివేయాలంటూ

ప‌ది ల‌క్ష‌ల మందికి కండ్ల‌ద్దాలు

అంధత్వరహిత తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో బుధవారం నాటికి దాదాపు పది లక్షలమందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. కంటివెలుగు ప్రారంభమైన నాటినుంచి మొత్తం 35 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,903 గ్రామాలు, 202 వార్డుల్లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో 51,66,689 మందికి కంటి పరీక్షలు చేశారు. 9,98,797 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,17,717 మందికి పరీక్షలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కంటి వెలుగు దిగ్విజయంగా సాగుతున్నది. 30 సర్కిళ్ల పరిధిలో బుధవారంనాటికి 10,49,718 మం దికి కంటి పరీక్షలు నిర్వహించారు. బుధవారం 24,017 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్టు

మునుపటి గుణమేల మాను

మార్పును ఆహ్వానించలేనివారు మచ్చల కోసం భూతద్దం పెట్టి వెదుకుతుంటారు. జీవితకాలమంతా సాగించే ఆ మచ్చల అన్వేషణే ఒక మహా విప్లవకార్యంగా భావిస్తుంటారు. ఆ మచ్చల అన్వేషణలో పాల్గొన-లేదని ఇతరులపై దుమ్మెత్తిపోస్తుంటారు. వీరు మేధావుల పేరిట చెలామణి అవుతుంటారు. పత్రికల ముసు-గు లో చెలరేగుతుంటారు. ప్రాంతాన్ని బట్టి, అధికారంలో ఉన్న పార్టీని బట్టి వీళ్ల చూపు మారిపోతుంది. నిజానికి యథాతథవాదులకూ వీళ్ల కు పెద్దగా తేడా ఉండదు. వెనుకటికి భూస్వాములు ఊళ్లోకి బడిని రాని-చ్చేవారు కాదు. కరెంటు వచ్చినా తమ ఇళ్లకే పరిమితం. చెరువు నీళ్లు కూడా తమకే సొంతం. ఇవేవీ బక్క రైతులకు, పేదలకు దక్కేవి కాదు. దక్కకుండా

పొంచి ఉన్న మరో ద్రోహం!

ఏపీ విభజన అశాస్త్రీయమంటూ టీడీపీ ఎంపీలు చేసిన వాదనలను కాంగ్రెస్ ఎందుకు ఖండించలేదు? తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు బేషరతుగా ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్.. తెలంగాణకు రక్షణలు ఎందుకు ప్రతిపాదించలేదు? దీనిపై మాట్లాడటానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు జంకుతున్నారు? విభజన బిల్లులో ఉభయ రాష్ర్టాలకు 95(1) ప్రకారం పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్నురాయితీ కల్పించాలన్న విషయాన్ని కాంగ్రెస్ ఎందుకు విస్మరిస్తున్నది? బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయడం లేదు? ఏపీ, తెలంగాణలో టీడీపీతో పొత్తులకు వాతావరణాన్ని సిద్ధంచేసుకుంటున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సంకేతమేమిటి?తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అధికార దాహం,

ఓటు మీది - గెలుపు నాది..!

కోట్లాది బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నూతన్ నాయుడిగా ఉన్న నన్ను బిగ్ బాస్ నూతన్ నాయుడిగా చేసిన మీకూ, బిగ్ బాస్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమాభిమానాలతో బిగ్ బాస్ లో రెండు వారాలు ఉన్నాను. హౌస్ లో ఉన్నప్పుడూ, బయటకు వచ్చిన తరువాత కూడా మీరు చూపించిన ఆదరణ, అభిమానం జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను. అడక్కుండానే ఇంత గుర్తింపు ఇచ్చిన బిగ్ బాస్ ఇంకో అవకాశం ఇస్తున్నారు. ఇంతకుముందు ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని మళ్ళీ హౌస్ లోకి తీసుకు రావాలనేది బిగ్ బాస్ ఆలోచన. మీరు వేసే ఓట్ల ఆధారంగా

నాగచైతన్య-సమంత జంటగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం !!

మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి “నిన్ను కోరి”తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు