ఇది నాకు గ‌ర్వ‌కార‌ణం : ఇవాంకా

ఇది నాకు గ‌ర్వ‌కార‌ణం : ఇవాంకా

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుపై అమెరికా అధ్యక్షుడు సలహాదారు ఇవాంకా ట్రంప్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. జీఈఎస్ సదస్సులో పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నట్లు ఇవాంకా తెలిపారు. హైదరాబాద్‌లో రెండు వారాల క్రితం జరిగిన ఈవెంట్‌పై మంగళవారం ఇవాంకా ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన బృందం ఇవాంకా నేతృత్వంలో సదస్సుకు హాజరైంది. ఆ ట్వీట్‌ను సుమారు 1500 మంది భారతీయులు, ఆరువేల మంది విదేశీయులు షేర్ చేశారు. మరో 900 మంది ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌లో ఇవాంకా సదస్సు నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ హిందీ పదం ధన్యవాద్ అని వాడారు. జీఈఎస్ సదస్సులో సుమారు 1200 మంది చురుకైన వ్యాపారవేత్తలతో సహా తమ దేశానికి చెందిన 350 మంది పాల్గొన్నట్లు ఇవాంకా ఆ ట్వీట్‌లో తెలిపారు. అద్భుతమైన ఆహ్వానం ఇచ్చిన ప్రధాని మోదీ, భారత దేశ ప్రజలకు థ్యాంక్స్ అంటూ ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

It was an honor to participate in @GES2017 in Hyderabad, India with 1,200 brilliant and passionate entrepreneurs from around the world, including our delegation of 350 Americans! Thank you Prime Minister Modi and the people of India for the warm hospitality. धन्यवाद! #GES2017 pic.twitter.com/3pbKylMaeQ
— Ivanka Trump (@IvankaTrump) December 12, 2017

(Visited 97 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *