జ‌ల‌దృశ్యం నుండి జ‌ల‌స్వ‌ప్నం వైపు

జ‌ల‌దృశ్యం నుండి జ‌ల‌స్వ‌ప్నం వైపు

2001 ఏప్రిల్ 27న హుస్సేన్ సాగ‌ర్ స‌మీపాన జ‌ల‌దృశ్యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావానికి బాట‌లు వేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ 14 ఏండ్లు అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2014లో తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అది మొద‌లు తెలంగాణ‌కు గ‌త అర‌వైఏండ్ల‌లో జ‌రిగిన అన్యాయాల‌ను స‌రిదిద్ద‌డం మొద‌లుపెట్టారు. ముఖ్యంగా తెలంగాణ‌కు సాగునీరే భ‌విష్య‌త్ అని తెలంగాణ ప్రాజెక్టుల‌ను రీ డిజైన్ చేసి నిర్మాణాలు మొద‌లు పెట్టారు. విప‌క్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోటి ఎక‌రాలకు సాగునీరు ఇచ్చి తీరుతామ‌ని ప్ర‌క‌టించి ఇటు పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం .. అటు ఉత్త‌ర తెలంగాణ‌లో కాళేశ్వ‌రం ప్రాజెక్టును శ‌ర‌వేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో 19 నెల‌ల కింద‌ట మొద‌లు పెట్టిన కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌నుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించేందుకు ప్రాజెక్టుల బాటప‌ట్టారు. నిన్న క‌రీంన‌గ‌ర్ చేరుకున్న ఆయ‌న ఈ రోజు ప్రాజెక్టు ప‌నుల‌ను చూడ‌నున్నారు.

ముందుగా క‌రీంన‌గ‌ర్ తీగలగుట్టపల్లి నుంచి తుపాకులగూడెం బ్యారేజీకి చేరుకుని ప‌నుల‌ను కేసీఆర్ ప‌రిశీలిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ వెళ్లి అక్క‌డ బ్యారేజీ ప‌నులు ప‌రిశీలిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి పంప్ హౌజ్ అనంతరం అన్నారం బ్యారేజీ పనులను, ఆ తర్వాత సిరిపురం పంప్ హౌజ్ పనులను పరిశీలిస్తారు. అక్కడే మధ్యాహ్న విరామం తీసుకుంటారు. సిరిపురంలో మ‌ధ్యాహ్న భోజ‌నం చేసిన తర్వాత సుందిళ్ల బ్యారేజీకి బయలుదేరుతారు. ఆ తర్వాత గోలివాడ పంప్ హౌజ్ పనులను పరిశీలించి సాయంత్రం ఎన్టీపీసీ రామగుండం చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. శుక్రవారం మేడారం, రామడుగు, రాంపూర్ లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

(Visited 273 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *