శాడిస్టు చంద్ర‌దాసు భావప్రాప్తి

శాడిస్టు చంద్ర‌దాసు భావప్రాప్తి

నాకు దూరం కాబ‌ట్టి నీకు దూరం కావాలి .. న‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు కాబ‌ట్టి నిన్ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను .. నువ్వు నాకే ద‌క్కాలి. లేకుంటే యాసిడ్ పోసి చంపుతా. నాకు ద‌క్క‌నిది మ‌రెవ‌రికీ ద‌క్క‌డానికి వీలు లేదు. ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ వ్య‌వ‌హారం అచ్చం ఇలాగే ఉంది. ఉంటుంది. ఆంధ్రోడు కాబ‌ట్టి ఆంధ్ర మీద ప్రేమ‌ను కాద‌న‌లేం. క‌మ్మోడు కాబ‌ట్టి చంద్ర‌బాబు మీద ప్రేమ ఆయ‌న వ్య‌క్తిగ‌తం. త‌న ప‌త్రిక‌కు లాభం జ‌రుగుతుంది కాబ‌ట్టి ఆంధ్ర ప్ర‌భుత్వ అవినీతికి కొమ్ముకాయ‌డం ఆయ‌న వ్యాపార విష‌యం అని వ‌దిలేద్దాం. కానీ ఆయ‌న జీవిత‌కాలంలో ఒక్క‌సారి తాను జ‌ర్న‌లిస్టును అని .. జ‌ర్నలిస్టుగా ఆంధ్ర‌కు న్యాయం జ‌ర‌గాలి కోరుకుంటూ .. తెలంగాణ‌లో జ‌రుగుతున్న నిజాల‌ను మ‌రుగున ప‌డేస్తూ విషం క‌క్కుతున్న అన్న విష‌యాన్ని ఒకసారి ప్ర‌శ్నించుకుంటే .. ఆయ‌న‌లోని ఆత్మ ఆయ‌న‌ను అడిగితే ఉరేసుకోవ‌డమే ఉత్త‌మ శిక్ష అని చెప్పాలి.

చిత్త‌శుద్ది .. అంకిత‌భావం .. ప‌ట్టుద‌ల ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనేక కుట్ర‌ల‌ను చేధించి నాలుగు కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించారు. క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న తెలంగాణ‌ను ఇష్ట‌ప‌డి అభివృద్ది చేసుకుంటున్నారు. ఓ తండ్రి త‌న కుటుంబం ఎలా ఉండాలి .. త‌న పిల్ల‌లు ఎలా ఎద‌గాలి .. వారి భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోవాలి అన్న స్ప‌ష్ట‌మ‌యిన ఆలోచ‌న ప్ర‌ణాళిక‌తో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. గ‌త 60 ఏండ్ల‌లో దేశంలోని ఏ రాష్ట్రంలో ఏ ముఖ్య‌మంత్రి ఆలోచించ‌ని విధంగా .. ఆలోచ‌న చేయ‌ని విధంగా వినూత్న ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి వాటిని అమ‌లు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కేంద్రం స‌హ‌క‌రించ‌కున్నా .. ఆంధ్రా మీడియా, ఆంధ్రా ప్ర‌భుత్వం అడుగ‌డుగునా అడ్డుపుల్ల‌లు వేసినా ఉద్య‌మంలో మాదిరిగానే వాటిని చేధించి ముందుకు వెళ్తున్నారు. కేసీఆర్ ప‌ట్టుద‌ల .. పార‌ద‌ర్శ‌క‌త చూసి కేంద్ర‌మే ఆయ‌న‌కు స్నేహ‌హ‌స్తాన్ని చాచి ముందుకు వెళ్తుంది. కేంద్రంతో ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎలా ఉండాలో అలా ఉంటూ త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు.

ఇక మామ‌కు వెన్నుపోటు పొడిచి అధికార పీఠం ఎక్కిన చంద్ర‌బాబుకు ఎలాంటి ల‌క్ష్యం లేదు. అధికార‌మే ఆయ‌న ల‌క్ష్యం .. ఆ దిశ‌గానే ఆయ‌న అప్ప‌ట్లో ప‌నిచేశారు. ఇప్పుడు ఆంధ్రాలో అదే ప‌నిచేస్తున్నారు. ప్ర‌జ‌ల భ‌విష్య‌త్ తో గానీ .. రాష్ట్ర అభివృద్దితో గానీ చంద్ర‌బాబుకు ప‌నిలేదు. కేవ‌లం అధికారం అనేది ఆయ‌న చేతిలోనే ఉండాలి అన్న ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నారు. అందుకే తెలంగాణ – ఆంధ్ర విడిపోయిన త‌రువాత కేసీఆర్ విజేత‌గా నిలిస్తే .. ఆంధ్ర‌కు దిక్కునేనే అన్న ప్ర‌చారంతో అంద‌లం ఎక్కిన చంద్ర‌బాబు నాయుడు ప‌రాజితుడిగా నిలిచాడు. బాబు వైఫ‌ల్యాల‌ను ఎంత‌లా క‌ప్పిపుచ్చేందుకు ప్ర‌య‌త్నించినా వీలుకాక ఆంధ్రా మీడియా .. రాధాకృష్ణ వంటి కొంద‌రు చంద్ర‌దాసులు కేసీఆర్ ను చిన్న‌గా చేసేందుకు విఫ‌ల‌య‌త్నాలు చేస్తున్నారు.

ఆంధ్రాలో చంద్ర‌బాబు అవినీతి పాల‌న గురించి ఇంట‌లిజెన్స్, బీజేపీ నేత‌ల ద్వారా స‌మ‌గ్ర స‌మాచారం తెప్పించుకున్న కేంద్రం బాబును బ‌య‌ట‌పెట్టింది. ఈ విష‌యాన్ని రాధాకృష్ణ ఈ రోజు రాసిన కొత్త‌ప‌లుకులో నిస్సిగ్గుగా ఒప్పుకున్నాడు. అదే స‌మ‌యంలో బాబును మాత్ర‌మే మోడీ దూరం పెట్ట‌లేదు .. కేసీఆర్ ను కూడా దూరం పెట్టాడు అని కూశాడు. పోల‌వ‌రం రీ డిజైన్ తో భారీ అవినీతికి రంగం సిద్దం చేసిన చంద్ర‌బాబు ఎత్తుల‌కు కేంద్రం చెక్ పెట్టింది. ఏకంగా కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్ పోల‌వ‌రం ప‌నులు ఆపాల‌ని ఆంధ్ర‌కు లేఖ రాశారు. దాని వెన‌క ఉన్న అవినీతి గురించి శూల‌శోధ‌న వార్త‌లు రాయాల్సిన రాధాకృష్ణ అవ‌న్నీ వ‌దిలేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌బోతున్న అధికారి రాసిన లేఖ క‌ల‌క‌లం అంటూ త‌న అవివేకాన్ని .. వికారాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు. రాసిన వ్య‌క్తి ఎందుకు రాశాడు ? అస‌లు ఏ ప్ర‌భుత్వానికి అయినా గ‌తంలో కేంద్రం నుండి ఇలా లేఖ‌లు రాశారా ? అన్ని అనుమ‌తులు తెచ్చుకున్న పోల‌వ‌రం ఇన్నాళ్లు ఎందుకు ఆగింది ? చ‌ంద్ర‌బాబు ప్ర‌భుత్వం తాజాగా పోల‌వ‌రం అంచ‌నాలు పెంచి పోల‌వ‌రం కాంట్రాక్ట‌ర్ల‌ను ఎందుకు మార్చే ప్ర‌య‌త్నం చేస్తుంది ? అన్న ప్ర‌శ్న‌లు రాధాకృష్ణ జ‌ర్న‌లిస్టు బుర్ర‌కు త‌ట్ట‌లేదు.

కానీ మెట్రో రైలు ప్రారంభానికి, జీఈఎస్ స‌ద‌స్సుకు వ‌చ్చిన ప్ర‌ధాన‌మంత్రి మోడీ మాత్రం కేసీఆర్ తో మాట్లాడిన దాఖ‌లాలు గానీ లేవు. కేసీఆర్ కూడా ముభావంగా క‌నిపించారు అని త‌న జ‌ర్న‌లిస్టు క‌లానికి భావప్రాప్తి .. త‌న చంద్ర‌బాబు మ‌న‌సుకు ఆత్మ తృప్తి క‌లిగించాడు రాధాకృష్ణ‌. అక్క‌డితో ఆగ‌కుండా ద‌క్షిణాదిన కేసీఆర్ మోడీ వ్య‌తిరేక కూట‌మిని త‌యారు చేస్తున్నార‌ని అందుకే మోడీ కేసీఆర్ కు దూరంగా ఉన్నార‌ని చెప్పుకొచ్చాడు. మ‌రి మెట్రో రైలు ప్రారంభ స‌మ‌యంలో కేటీఆర్ వ‌చ్చేదాకా మోడీ రిబ్బ‌న్ క‌ట్ చేయ‌కుండా ఎందుకు ఆగారో రాధాకృష్ణ‌కు త‌ట్ట‌న‌ట్లుంది. త‌డితే దానికీ ఓ కార‌ణం చూపేవాడు. అస‌లు మెట్రో ప్రారంభానికి మోడీ అస‌లు అపాయింట్ మెంట్ ఇయ్య‌లేద‌ని, షెడ్యూలు ఖ‌రారు అయిన త‌రువాత ప్ర‌ధాని కార్యాల‌యం ఆమోదించ‌లేద‌ని, అధికారికంగా తెల‌ప‌లేద‌ని రాధాకృష్ణ & ఆంధ్రా మీడియా కో పెన్నులో ఇంక‌యి పోయేదాకా రాశాయి. వ‌చ్చి పోయిన త‌రువాత ఇలా రాధాకృష్ణ ఏడుపు రాత‌లు మొద‌లు పెట్టాడు. తెలంగాణ ఉద్య‌మం బ‌ల‌ప‌డేదాకా ఒక రాత .. బ‌ల‌ప‌డ్డాక ఇంకో రాత .. తెలంగాణ ప్ర‌క‌టించే వ‌ర‌కు ఒక రాత .. ప్ర‌క‌టించిన త‌రువాత ఇంకో రాత .. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యే వ‌ర‌కు ఓ ఏడుపు .. వ‌చ్చిన త‌రువాత ఇంకో ఏడుపు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తాను జ‌ర్న‌లిస్ట్ ను అని చెప్పుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాడు .. కానీ ఆంధ్రా ప్ర‌తినిధి .. చంద్ర‌బాబు కోవ‌ర్ట్ అని తెలిసిపోయి తేలిపోతుంటాడు. ఎన్ని సార్లు ప‌లుకులు కొత్త‌గా రాసుకున్నా నీ స్వ‌యంతృప్తి కోస‌మే అన్న‌ది గుర్తుంచుకుంటే చాలు.

సందీప్ రెడ్డి కొత్త‌ప‌ల్లి

(Visited 1,783 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *