ఫిబ్ర‌వ‌రిలో కేటీఆర్ అమెరికా టూర్

ఫిబ్ర‌వ‌రిలో కేటీఆర్ అమెరికా టూర్

తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ వచ్చేఏడాది ఫిబ్రవరి 6 నుంచి 12వతేదీ వరకు వారంపాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన సిలికాన్‌ వ్యాలీ, న్యూయార్క్‌లతో పాటు హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో జరిగే సదస్సులోనూ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకను కలిసే అవకాశం ఉంది. కేటీఆర్‌ సిలికాన్‌ వ్యాలీలో పర్యటించి, అక్కడ పారిశ్రామికవేత్తలతో, కంపెనీల ప్రతినిదులతో భేటీ అయి టీహబ్‌ రెండో దశలో పెట్టుబడులు ఇతర అంశాల గురించి చర్చిస్తారు.

న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో సమావేశమవుతారు. తెలంగాణలోని ఇమేజ్‌ సౌథం, యానిమేషన్‌, ఔషధనగరి తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులను కోరతారు. న్యూయార్క్‌లోనే ఆయన ఇవాంకను కలిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 10న హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూలుకు వెళతారు. అక్కడ భారత్‌- నూతన ఆవిష్కరణల అంశంపై రెండురోజుల పాటు జరిగే సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. 12న వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు.

(Visited 91 times, 2 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *