కేసీఆర్ చెక్ పెడితే ఇలా ఉంటుంది

కేసీఆర్ చెక్ పెడితే ఇలా ఉంటుంది

తెలంగాణ ఏర్ప‌డ‌గానే అన్యాయంగా తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను పోల‌వ‌రం నిర్మాణం కోసం ఆంధ్రాలో క‌లిపిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత కేంద్రం ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు విడుద‌ల చేసింది. కేంద్ర ప్ర‌భుత్వంలో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉండ‌డంతో అప్ప‌ట్లో ఆడింది ఆట .. పాడింది పాట‌. పోల‌వ‌రానికి కేంద్రం నుండి భారీగా నిధులు తెచ్చుకున్న చంద్ర‌బాబు వాటిని ఇత‌ర ప‌నుల‌కు మ‌ల్లించాడు. దీని మీద కేంద్రం నివేదిక అడిగితే మెల్ల‌గా పోల‌వ‌రం ఆల‌స్యానికి కేంద్రానిదే బాధ్య‌త అని త‌న అనుకూల మీడియాతో కేంద్రం మీద దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టాడు. ఆల‌స్యంగా మేలుకున్న కేంద్రం చంద్ర‌బాబు అస‌లు రూపం తెలుసుకుని దూరం పెట్టింది. పోల‌వ‌రం కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చి భారీ అవినీతికి చంద్ర‌బాబు ప‌న్నిన ప‌న్నాగం నేప‌థ్యంలో బీజేపీ గ‌ట్టిగానే బాబును మంద‌లిస్తుంది. దీంతో చంద్ర‌బాబు సానుభూతి నాట‌కానికి తెర‌లేపాడు. పోల‌వ‌రం న‌న్ను అయినా చేయ‌నివ్వండి .. మీర‌యినా చేయండి అంటూ క‌థ మొద‌లుపెట్టాడు.

ఇక మొద‌టి ఏడాదిన్న‌ర తెలంగాణ అభివృద్దికి మోకాల‌డ్డిన కేంద్రం కేసీఆర్ ప్ర‌భుత్వం ఎలాంటి అవినీతికి అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శకంగా అభివృద్ది ప‌నుల‌ను చేస్తుండ‌డం చూసి త‌న వ్య‌తిరేక‌త‌ను మార్చుకుంది. కేసీఆర్ ప్ర‌ణాళికాబ‌ద్దంగా దేశానికి, ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా అనేక ప‌థ‌కాల‌ను చేప‌డుతుండ‌డం, ప‌దే ప‌దే కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రుపుతూ ప‌థ‌కాల అమ‌లుకు అనుమ‌తులు కోరుతూ ముందుకు వెళ్తుండ‌డంతో తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి వెంట‌వెంట‌నే అనుమ‌తులు వ‌స్తున్నాయి. మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌, టీఎస్ ఐపాస్, టీ హ‌బ్ లు కేంద్రం దృష్టిని ఆక‌ర్షించింది.

ఆంధ్రాలో పోల‌వ‌రం నిర్మాణం పెండింగ్ పెట్టి ఆల‌స్యానికి కేంద్రానిది బాధ్య‌త‌గా చంద్ర‌బాబు చూయిస్తున్నాడు. కేంద్రం స‌హ‌క‌రించకున్నా ఓపిక‌తో కేసీఆర్ ప‌నిచేసుకుంటూ పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్రాలో పోల‌వ‌రం గురించి చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో న‌ష్ట‌పోతున్న ఆదివాసీలు ముంపుకు గురికాకుండా .. పోల‌వ‌రం నిర్మాణం కాకుండా చూసేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. పోల‌వ‌రం నిర్మాణం జ‌ర‌గాలంటే ఒడిషా, చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల అనుమ‌తులు కావాలి. ఆ రాష్ట్రాలు కూడా దీని నిర్మాణంతో పెద్ద ఎత్తున న‌ష్ట‌పోతున్నాయి. ఇక్క‌డే కేసీఆర్ ఆలోచ‌న చేసి తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి, హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ల‌ను ఒడిషా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ వ‌ద్ద‌కు పంపారు.

పోల‌వ‌రం నిర్మాణంతో తెలంగాణ‌లో ఆదివాసీల‌తో పాటు ఒడిషా, ఛ‌త్తీస్ ఘ‌డ్ లు తీవ్రంగా న‌ష్ట‌పోతున్న విష‌యాన్ని ఆయ‌న‌కు వివ‌రించారు. దీంతో ఈ స‌మ‌స్య ఉమ్మ‌డిపోరుగా మారింది. తెలంగాణ – ఒడిషా – చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాలు ఇప్పుడు సంయుక్తంగా పోల‌వ‌రాన్ని అడ్డుకోబోతున్నాయి. అన్యాయంగా ఆదివాసీల‌ను ముంచుతున్నారు .. కేసీఆర్ ప‌ద‌వి కోసం ఏడు మండ‌లాల‌ను ఆంద్రాకు తాక‌ట్టుపెట్టార‌ని అప్ప‌ట్లో చాలా మంది చాలా చాలా మాట‌లు మాట్లాడారు. ఆ త‌రువాత వాళ్లు ఆదివాసీల‌ను ఆదుకునేందుకు గానీ .. పోల‌వ‌రం నిర్మాణం అడ్డుకునేందుకు గానీ ఏ ప్ర‌య‌త్న‌మూ చేసిన దాఖ‌లాలు లేవు. ఇన్నాళ్లు స‌మ‌యం కోసం వేచిచూస్తున్న కేసీఆర్ ఇప్పుడు చ‌క్రం తిప్పి మూడు రాష్ట్రాల ముంపును కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పోల‌వ‌రాన్ని అడ్డుకోనున్నారు. కేసీఆర్ చెక్ పెడితే ఎలా ఉంటుందో విప‌క్షాలు తెలుసుకుంటే మంచిది.

(Visited 5,917 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *