కండువా క‌ప్పేందుకు కాంగ్రెస్ రెఢీ

కండువా క‌ప్పేందుకు కాంగ్రెస్ రెఢీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌తిరేకులంద‌రినీ కాంగ్రెస్ గూట్లోకి లాగేందుకు ఏఐసీసీ స్థాయిలో ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తుంది. కేసీఆర్ అభివృద్ది ముందు విప‌క్షాల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు నిల‌వలేక పోతుండ‌డంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ వ్య‌తిరేక ఓట్లు చీల‌కుండా అంద‌రినీ త‌మ నియంత్ర‌ణ‌లోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఏఐసీసీ అధ్య‌క్షుడుగా రాహుల్ గాంధీని కూర్చోబెట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దాంతో పాటు రాహుల్ ఆధ్వ‌ర్యంలోని ఒక టీం తెలంగాణ‌లోని గ‌ద్ద‌ర్, కోదండ‌రాంల‌ను ఆకర్షించేందుకు ప‌నిచేస్తున్న‌ట్లు ఏఐసీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కోదండ‌రాం వెన‌కుండా న‌డిపించిన కాంగ్రెస్ ఇక కండువా క‌ప్పేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు నేత‌లు కోదండ‌రాంతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, నిరుద్యోగుల స‌భ త‌ర్వాత ఈ కార్య‌క్ర‌మం ఉండొచ్చ‌ని స‌మాచారం.

(Visited 947 times, 8 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *