ఆధునిక దేవాలయాలు

ఆధునిక దేవాలయాలు

అమెరికాలో ఉన్నతెలంగాణ సోదరులు, ‘డయల్ యువర్ విలేజ్’ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ రవి మేరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక బృందంగా కొందరం ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన పెట్టుకున్నాం. కొన్ని చోట్లకు వెళ్ళ ప్రత్యక్షంగా ప్రాజెక్ట్ పురోగతి చూసి వచ్చాం. కళ్ళారా చూడటం ఒక అపూర్వ అనుభవం. అవగాహన తరగతి. తెలంగాణా బిడ్డలకు పునర్నిర్మాణ దశ నిజంగానే అవగాహన తరగతి. ఇలాంటివి ఇంకా చాలా జరగాలి.

తొలి పర్యటన వల్ల కలిగిన భావన ఏమిటంటే, తెలంగాణా మౌలిక రంగాల్లో పెద్ద హడావిడి లేకుండా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటోంది. ఆ పని చాలా మంది ఊహకు కూడా అందని రీతిలో శరవేగంగా సాగుతోంది. చూస్తే గాని తెలియనంత విస్త్రుత స్థాయిలో ఉంది.

తెలంగాణాలో నిలకడగా, కనీకన్పించకుండా గంబీరంగా సంతరిచుకుంటున్న ఈ మార్పు ఎంతట సంతోషమో ఇంకా కొన్నాల్లాగితే అందరికీ తెలుస్తుంది. ఫలితాలు కనబడే రోజు కూడా ఎంతో దూరంలో లేదు.

స్వాతంత్రా నంతరం ఎలా ఒక దేశం జాతీయ భావనతో పెద్ద పెద్ద కలలు సాకారం చేసుకుందో, మన రాష్ట్రం అలాంటి స్థితిలో నేడుంది.. చాలా పెద్ద మార్పు రానున్నది. ముఖ్యంగా నీళ్ళ విషయం లో.

సమీప కాలంలోనే తెలంగాణ ఒక వాటర్ గ్రిడ్ కానున్నది. సాగునీరు, త్రాగు నీటి విషయంలో ఒక గొప్ప సాహసంతో విజనరీతో పనులు జరుగుతున్నాయి.

అటవీ అనుమతులు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే మేం వెళ్ళడంతో ఆ ఆనందం అధికారుల్లో, ఇంజనీర్ల లో కనిపించింది. అది వారిలో గొప్ప విశ్వాసం తేవడం కళ్ళారా చూసాం.

ఒక్క మాటలో తెలంగాణా ఇంజినీర్లు ప్రభుత్వ పట్టుదలను అర్థం చేసుకొని, భూమి పుత్రులుగా తమవంతు కార్యశీలతను జోడిస్తూ ఈ అపూర్వ ప్రాజెక్ట్ ను అతిత్వరలో పూర్తి చేయడం కోసం పునరంకితమయ్యారు.

తొలిగా ఆ సంగతి మనసుకు హత్తుకున్నది. అది అమిత సంతోషాన్ని కలిగించింది.

-కందుకూరి రమేష్ బాబు
30.11.2017
శీర్షిక క్రెడిట్ బై – విశ్వేశ్వర్ మంగల్ పల్లి

(Visited 407 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *