తెలుగు వెల‌గాలి .. తెలంగాణ ఖ్యాతి మెర‌వాలి

తెలుగు వెల‌గాలి .. తెలంగాణ ఖ్యాతి మెర‌వాలి

హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తున్న ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌తో తెలంగాణ ఖ్యాతి ద‌శ‌దిశ‌లా వ్యాపించాల‌ని, తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్న సాహితీవేత్త లందరి సమక్షాన తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. డిసెంబర్ 15 నుంచి నగరంలో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా తెలుగు మాట్లాడే ముఖ్య మంత్రులు, గవర్నర్ వంటి ప్రముఖులను ఆహ్వానించాలని చెప్పారు. అలాగే ఇతర గుర్తింపు పొందిన భారతీయ భాషల సాహితీవేత్తలను కూడా మహాసభల సందర్భంగా గౌరవించి… సన్మానించాలని సూచించారు. అతిథులకు బస, భోజనం, రవాణా సదుపాయాల కల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఒక్కో వేదిక వద్ద ఒక్కో ఇన్‌చార్జి ఉండాలన్నారు. ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మారిషస్ ఉపాధ్యక్షుడు పరమశివమ్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరవుతారని తెలిపారు. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా వస్తారని తెలిపారు.

మహాసభల ప్రధాన వేదిక ఎల్.బి.స్టేడియం డిజైన్‌తోపాటు నగరంలో ఏర్పాటు చేయాల్సిన తోరణాల డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించి, ఆమోదించారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, మహాసభలకు నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలని సూచించారు. స్టేడియంలో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలి. సాహితీ సభలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అని సూచించారు. దీంతో పాటు స్టేడియంలో తెలంగాణ వంటకాల పేరుతో ఫుడ్ స్టాళ్లతోపాటు వివిధ కళా ప్రక్రియల స్టాళ్లను నిర్వహించాలని చెప్పారు. తెలంగాణ ఆహార్యం, సంస్కృతి-చరిత్ర, సంప్రదాయాలను ప్రతిబింబించే లేజర్ షో ఏర్పాటు చేయాలని సూచించారు.

చివరి రోజు పెద్ద ఎత్తున బాణాసంచా వేడుకతోపాటు నగరమంతా అందంగా అలంకరించాలని చెప్పారు. తోరణాలు తెలుగు సాహితీమూర్తుల పేర్లతో ఉండేవిధంగా చూడాలని, నగరమంతా బెలూన్లు ఎగురవేయాలని తెలిపారు. తెలుగు భాషా ప్రక్రియలతో పాటు హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా ఉర్దూ కవి సమ్మేళనం, ఖవ్వాలి లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంగీత, సాహిత్య, కళా రంగాల ప్రముఖులను ప్రభుత్వం తరఫున సత్కరించాలని అన్నారు.

(Visited 123 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *