December 2017

కేసీఆర్ వ్యూహం కేంద్రంలో క‌ద‌లిక‌

గోదావ‌రి న‌ది మీద మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ తో రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒప్పందం చేసుకుంటే విప‌క్షాలు ఎద్దేవా చేశాయి. ఆంధ్రా మీడియా రాద్దాంతం చేసింది. కానీ ఈ రోజు ఆ ఒప్పంద‌మే తెలంగాణ కొర‌కు క‌డుతున్న అనేక ప్రాజెక్టుల‌కు కేంద్రం నుండి అనుమ‌తి వ‌చ్చేలా చేసింది. కేంద్రం నుండి ఒక్క అనుమ‌తి తీసుకురావ‌డానికి గ‌త ప్ర‌భుత్వాల కాలంలో ఏళ్ల త‌ర‌బ‌డి .. ద‌శాబ్దాల పాటు కాల‌యాప‌న జ‌రిగిన ప్రాజెక్టులు కోకొల్ల‌లు. కానీ గ‌త మూడున్న‌రేళ్ల కాలంలో కేంద్రం నుండి తెలంగాణ ప్ర‌భుత్వం రెండు వేల‌కు మించిన అనుమ‌తులు సాధించ‌డం విశేషం. ఇది ఓ రికార్డు కూడా.

త్వరలో మన తెలంగాణ ఆపిల్

ఆదిలాబాద్ జిల్లాలోని కెరీమేరీ, బజార్ హత్నుర్, జైనూర్, నార్నూర్, మండలాల్లో రైతులు ఆపిల్ సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా లోని వాతావరణ పరిస్థితులు ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని తేలింది. ముఖ్యంగా కెరీమేరీ మండలంలోని పరిస్థితులు ఆపిల్ సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పోలి ఉన్నాయని, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కంటే అనువుగా ఉన్నాయని సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూర్ బయాలజీ శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో ఎండలను తట్టుకోవడానికి ఆపిల్ సాగు చేస్తున్న తోటల్లో పూర్తిగా పచ్చదనంతో ఉండి అతితక్కువ ఉష్ణోగ్రతలు ఉండేలా రైతులు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే నాటిన మొక్కలు

కాసుల కాన్పుకు చెల్లు చీటీ

భాస్కర్. పెళ్లిళ్లకు, సభలకు డెకరేషన్ చేయడం వృత్తి. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. భార్య గర్భవ తి. ఆమెకు గుండె జబ్బు ఉండటంతో డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. పరిస్థితి చెప్పుకొని సలహా అడిగాడు. ఎందుకైనా మంచిది కాన్పు అయ్యేవరకు హైదరాబాద్ లో ఉంచు అని చెప్పా. గుండెజ బ్బు ఉండటంతో కాన్పు కష్టం అని డాక్టర్లు చెప్పారు. అబార్షన్ చేయించుకున్నా అదే పరిస్థితి. భార్యభర్తలు ఇద్దరూ మాట్లాడుకొని కష్టమో నష్టమో బిడ్డను కనడానికే సిద్ధ మయ్యారు. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ దవాఖానలో లక్షా పదివేలకు మాట్లాడుకున్నారు. కష్టమైనా కన్నబిడ్డ మీద మమకారంతో ఆ లక్షను అప్పోసప్పో చేసి సమకూర్చుకున్నాడు.

భాష‌నే కేసీఆర్ బ‌లం.. బ‌ల‌గం

ఆయ‌న హీరో కాదు ఈల వేస్తే అభిమానులు గోల చేయ‌డానికి.. ఆయ‌న అప్ప‌టికి పెద్ద నాయ‌కుడు కూడా కాదు పిలుపునిస్తే వేల మంది పోగు కావ‌డానికి. బ‌క్క‌ప‌లుచ‌ని దేహం .. పాపిట తీసిన జుట్టు .. మాట్లాడే మాట‌లో దృడ‌త్వం .. చెప్పే మాట‌ల్లో స్ప‌ష్ట‌త .. ఆయ‌న‌నే కేసీఆర్. జ‌ల‌దృశ్యం వేదిక మీద 50 ఏండ్ల తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించ‌డానికి తెలంగాణ రాష్ట్ర స‌మితిని ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గానే యావ‌త్ తెలంగాణ స‌మాజం కేసీఆర్ వైపు ఆస‌క్తిగా దృష్టి సారించింది. తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని .. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మూలంగా

ఎన్నెన్ని ప‌ద్యాలు చ‌దివానో

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నేప‌థ్యంలో తొలిరోజు పాట‌, ప‌ద్యాల‌తో అల‌రించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడో రోజు స‌మావేశాల‌లోనూ త‌ను చిన్న‌ప్పుడు చ‌దివిన ప‌ద్యాల‌ను గుర్తుచేసుకుని చ‌దివారు.. ఆయ‌న ప‌ద్యాల‌ను విని ఆయ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని చూసి స‌భికులంతా ఆశ్చ‌ర్యంతో హ‌ర్ష‌ద్వానాలు వ్య‌క్తం చేశారు .. కేసీఆర్ ప‌ద్యాలు మీకోసం సాహిత్యానికి, సాహితీ సృజన కోసం కృషి చేసేవారికి ఒకప్పుడున్న ఆదరణ మధ్యలో కొంత తగ్గింది. తెలంగాణలో రస స్ఫూర్తికి తక్కువ లేదు. రచించేవారు తక్కువేమీ లేరనేది ఈ తెలుగు మహాసభల సందర్భంగా రుజువవుతున్నది. నలభై ఏండ్ల కిత్రం చదువుకున్నపుడు ఎంత గొప్పగా చదివానో! నాకు సుమారు 3 వేల పద్యాలు

తెలుగు మహాసభలు .. కేసీఆర్ అనుభ‌వం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ 1974లో జ‌రిగిన తొలి తెలుగు మ‌హాస‌భ‌ల సంధ‌ర్భంగా ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను ప్రపంచ తెలుగు మహాసభల మూడోరోజున మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం (తెలంగాణ సారస్వత పరిషత్)లో స‌భికుల‌తో పంచుకున్నారు .. ఆ అనుభ‌వాలు మీకోసం .. కాలేజీ చదివేరోజుల్లో గంగారెడ్డిగారు ప్రిన్సిపాల్‌గా ఉన్నరు. అప్పట్లో లైబ్రరీలో చాలా అరుదైన పుస్తకాలుండేవి. ఖరీదైనవి. ఆ రిఫరెన్సు పుస్తకాలు లైబ్రేరియన్ ఇచ్చెటోడు కాదు. అప్పుడు మా ప్రిన్సిపాల్ వచ్చి వీడు ఏది అడిగితే అది ఇయ్యవయ్య. నేనిస్తా డబ్బులు అన్నారు. ఆయనకు అంతటి అభినివేశం ఉన్నది. 1974లో తొలి తెలుగు మహాసభల సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నరు. నేను, మిత్రుడు

ఉత్త మాట‌లు చెప్ప .. ఉత్త‌మ నిర్ణ‌యాలుంటాయ్

ఉత్తుత్తి మాట‌లు చెప్ప‌ను నేను .. ఉత్త‌మ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తాం. ప్రపంచ తెలుగు భాషాభిమానులంతా హర్షించేలా, తెలుగు భాష కోసం కృషి చేస్తున్నవారిని అన్ని విధాలుగా ఆదుకొనే రీతిలో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో మంచి పథకాలను ప్రకటిస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలుగు భాషోన్నతికి, సారస్వత అభివృద్ధికోసం చారిత్రాత్మక నిర్ణయాలను వెలువరిస్తామని తెలిపారు. తాము తీసుకొనే నిర్ణయాలు యావత్ప్రపంచంలోని మాతృభాషాభిమానులను సంతోషపరుస్తాయని అన్నారు. ఆదివారం ప్రపంచ తెలుగు మహాసభల మూడోరోజున మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం (తెలంగాణ సారస్వత పరిషత్)లోని శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై జరుగుతున్న శతావధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ

కేటీఆర్ .. లీడ‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్

తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, మున్సిప‌ల్ శాఖా మంత్రి కేటీఆర్ కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ ఏటా ఇచ్చే లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్‌కు ప్రకటించింది. పట్టణ మౌలిక వసతులున్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను ఎంపికచేసింది. ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నూతన రాష్ట్రాన్ని మంత్రి కేటీఆర్ దేశ యవనికపై తనదైన శైలిలో నిలిపిన తీరును బిజినెస్ వరల్డ్ అభినందించింది. పాలనాపరంగా ఆయన నిర్వహిస్తున్న బాధ్యతలు, రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నతీరు, దేశవ్యాప్తంగా మంత్రికి లభించిన పేరు వంటి అంశాలను పరిగణనలోకి

డిజిట‌ల్ తెలుగును ప్రోత్స‌హిద్దాం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు-2017 ను పురస్కరించుకొని, తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ విభాగం డిజిటల్ తెలంగాణ ఆధ్వర్యంలో “డిజిటల్ తెలుగు” సదస్సు బేగంపేటలోని హోటల్ ప్లాజాలో జరిగింది. సాంకేతిక యుగంలో మాతృభాషను పునాదులు మరింత పటిష్ట పరచడానికి, వర్తమానంలో ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలమీద ఒక అర్థవంతమైన చర్చ జరిగింది. ముందునుండీ ఈ రంగంలో కృషి చేస్తు తెలుగు అప్లికేషన్లు తయారు చేస్తున్న వారిని, అంతర్జాలం వేదికగా పనిచేస్తున్న తెలుగు సాహితీ వేత్తలను మరియు ప్రజలను ఒక అందరినీ ఒక చోట చేర్చి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ

అవ‌మానాలు ఇప్పుడే గుర్తొచ్చాయా ?

తెలంగాణ‌లో జ‌రుగుతున్న తెలుగు మ‌హాసభ‌ల‌కు ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును పిల‌వ‌లేదు కాబ‌ట్టి తాను వెళ్ల‌న‌ని ఓ గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు అనే అత‌ను ఆవేద‌న వ్య‌క్తం చేస్తాడు. ఆంధ్రాలో ఉన్న క‌వులంద‌రినీ పిల‌వ‌లేద‌ని మ‌రోకాయ‌న మీడియా ముందు మాట్లాడ‌తాడు. తెలంగాణ‌లో ఉన్న కొంద‌రిని పిల‌వ‌లేద‌ని మ‌రికొంద‌రు మాట్లాడతారు. మ‌రి ఇలాంటి స‌మావేశాలు ఇప్పుడే జ‌రిగాయా ? గ‌తంలో జ‌రిగిన తెలుగు మ‌హాస‌భ‌ల‌కు ఎంత‌మందిని ఆహ్వానించారు ? ఎంత మంది తెలంగాణ క‌వుల‌కు, సాహితీ వేత్త‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు ? అంటే వారి దగ్గ‌ర జ‌వాబు ఉండ‌దు. 2011 అక్టోబ‌రు 9న అంత‌ర్జాతీయ తెలుగు అంత‌ర్జాల మ‌హాస‌భ‌ల పేరుతో స‌మైక్య