ప్ర‌శంస‌లు కురిపించిన ప‌రుచూరి

ప్ర‌శంస‌లు కురిపించిన ప‌రుచూరి

‘‘కేటీఆర్ గారూ.. ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు.. నిన్న జరిగిన ప్రపంచ వ్యాపార సదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు. అభినందనలండీ. మీ భాషణం అనితర సాధ్యం’’ అని ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మీద ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ థ్యాంక్యూ సార్ అని రిప్లై ఇచ్చారు.

జీఈఎస్ రెండో రోజు మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు అనే అంశంపై జరిగిన ప్లీనరీకి కేటీఆర్ మాడరేటర్ గా వ్యవహరించారు. ఈ ప్లీనరీలో ప్యానలిస్టులుగా ఉన్న ఇవాంక ట్రంప్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్లతో చమత్కారంగా మాట్లాడమే కాకుండా సమాయనుగుణంగా వ్యవహరించారు. దీనిపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

(Visited 1,296 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *