ప్రైవేటులోనే అవ‌కాశాలు

ప్రైవేటులోనే అవ‌కాశాలు

ప్రైవేటు రంగంలోనే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారని అందుకే ఆ రంగాన్ని ప్రోత్సహిస్తే మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో రెండో రోజు ‘మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు’ అంశంపై ప్లీనరీ నిర్వహించారు. ఇందులో ఇవాంక ట్రంప్‌, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ భార్య చెర్రీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచ్చర్‌, డెల్‌ ఈఎంసీ కరేన్‌ క్వింటోస్‌ పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు.

పెరిగిన మహిళా భాగస్వామ్యం..

సీఎస్‌ఆర్ ద్వారా మహిళాభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి మరిన్ని శిక్షణ కేంద్రాలు అవసరమన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాటి అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామీణరంగ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. తాము శిక్షణ ఇచ్చినవారిలో 95 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. తన పిల్లలే తనకు పెద్ద స్ఫూర్తి అని చందాకొచ్చర్ చెప్పుకొచ్చారు. విద్య, ప్రోత్సాహం, సాధికారత ఉంటే మహిళలు ఏదైనా సాధిస్తారన్నారు. భారతదేశంలో మహిళా భాగస్వామ్యం చాలా పెరిగిందన్నారు. బ్యాంకింగ్ రంగంలో 40 శాతం మహిళలు పనిచేస్తున్నారు. దేశం నుంచి మహిళా క్రీడాకారిణులు అన్ని విభాగాల్లో ఉన్నారని తెలిపారు. నేడు భారతదేశ రక్షణశాఖ మంత్రి మహిళా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 7-8 ఏళ్లలో భారత జీడీపీ 700 బిలియన్ డాలర్లకు చేరుకోబోతున్నట్లు పేర్కొన్నారు.

(Visited 245 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *