ఇంక్యుబేట‌ర్ ఇండియా

ఇంక్యుబేట‌ర్ ఇండియా

భారత్ – అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించడమే జీఈఎస్ లక్ష్యం. ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే స్టార్ట‌ప్ ఇండియా ల‌క్ష్యం. జీఈఎస్‌లో 50 శాతానికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలే ఉన్నారు. హిళాభివృద్ధి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ ర్యాంకు మెరుగుపడింది. 100 ర్యాంకుతో మేము సంతృప్తిగా లేము. 50వ ర్యాంక్ ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న జీఈఎస్ -2017 స‌ద‌స్సులో ఆయ‌న‌ ప్రసంగించారు. ఆవిష్కరణలు, వ్యాపారవేత్తలకు ఇండియా ఇంక్యూబేటర్‌గా పని చేస్తుందని చెప్పారు.

అనేక అడ్డంకులు సృష్టించే పాత చట్టాలను చెత్త బుట్టలో వేశామన్నారు. మూడేళ్లలో కొత్త సంస్కరణలతో సరళతర వాణిజ్యంలో 140 నుంచి 100కు చేరుకున్నామని తెలిపారు. జన్ ధన్ యోజనతో ఇప్పటి దాకా దూరంగా ఉన్నవారిని ప్రధాన స్రవంతిలో భాగం చేశామని మోదీ పేర్కొన్నారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాలు పొందిన వారిలో 50 శాతం మహిళలే ఉన్నారన్నారు.

భారత స్వాతంత్య్రోద్యమంలో ఎంతో మంది మహిళలు కీలకపాత్ర వహించారు. మహిళను శక్తిగా భారతీయులు విశ్వసిస్తారని వెల్లడించారు. హైదరాబాద్ నగరం సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మీర్జాలకు నిలయమని పేర్కొన్నారు. అహల్యబాయి హోళ్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్లు భారత మహిళా శక్తికి ప్రతీకలు అని ప్రశంసించారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ భారత మహిళా మేధోశక్తికి నిదర్శనమని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తెలిపారు.

(Visited 133 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *