తెలంగాణ‌ పెట్టుబ‌డుల స్వ‌ర్గ‌ధామం

తెలంగాణ‌ పెట్టుబ‌డుల స్వ‌ర్గ‌ధామం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి లభిస్తుంది. టీఎస్ ఐపాస్ విశిష్టమైన విధానం. గ‌త మూడేళ్ల‌లో 5,469 ఇండస్ట్రియల్ యూనిట్లకు అనుమతి ఇచ్చాం. కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాం. పెట్టుబ‌డుల‌కు తెలంగాణ స్వ‌ర్గ‌ధామం. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్)లో సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం చేశారు.

వ్యక్తిగతంగా సదస్సుకు వచ్చిన వారిని స్వాగతించడం సంతోషంగా ఉందని, జీఈఎస్ సదస్సును ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ తెలంగాణకు నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందని, ఇప్పుడు తెలంగాణ.. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్‌కు కేంద్రంగా మారిందని, ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ రెండురోజులు తెలంగాణ అతిథ్యాన్ని ఆస్వాదిస్తార‌ని భావిస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు.

 

(Visited 220 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *