బాబు గ‌ట్టి పైర‌వే చేశాడు

బాబు గ‌ట్టి పైర‌వే చేశాడు

అమెరికా అధ్య‌క్షుడి కూతురు ఇవాంక ట్రంప్ అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ స‌ద‌స్సును నిర్వ‌హించేందుకు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు ముందుకు వ‌చ్చాయి. అయితే అమెరికా మాత్రం హైద‌రాబాద్ నే ఎంచుకుంది. అంత‌ర్జాతీయ స్థాయిని ఆక‌ర్షించిన ఈ స‌ద‌స్సును ఆంధ్రాలో నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు నాయుడు గ‌ట్టి పైర‌వే చేశాడ‌ట‌.

ఏకంగా అమెరికా కాన్సులేట్ అధికారుల‌నే క‌లిసి ఆంధ్రాలో నిర్వ‌హించేలా ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. ఒప్పుకుంటే అమ‌రావ‌తి లేదా విశాఖ‌లో దీనిని నిర్వ‌హిస్తామ‌ని అన్నార‌ట‌. కానీ అమెరికా మాత్రం హైద‌రాబాద్ లో నిర్వ‌హించేందుకే మొగ్గుచూపింద‌ట‌. అమ‌రావ‌తిలో జరిగితే అమెరికా కంపెనీల‌ను ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని భావించార‌ట‌. కానీ బాబు ప్ర‌య‌త్నాలు నెర‌వేర‌లేద‌ట‌. దీంతో పాటు మ‌రేద‌యినా కార్య‌క్ర‌మం ఆంధ్రాలో నిర్వ‌హిస్తాం ఇవాంక‌ను వ‌చ్చేలా ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నించార‌ట‌. కానీ ఈ స‌ద‌స్సుకు త‌ప్ప మ‌రెక్క‌డికి వెళ్ల‌డం కుద‌ర‌ద‌ని ఇవాంకా స్ప‌ష్టం చేసింద‌ట‌. అందుకే ఈ రోజు ఈ స‌ద‌స్సుకు చంద్ర‌బాబు హాజ‌రు కాలేద‌ని అంటున్నారు.

(Visited 2,422 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *