భార‌తీయులే మాకు స్ఫూర్థి

భార‌తీయులే మాకు స్ఫూర్థి

హైదరాబాద్‌లాంటి పురాతన నగరం ఇంత పెద్ద‌ టెక్నాలజీ హబ్‌గా ఎదగడం చాలా గొప్ప విషయం. తొలిసారి ఇంత పెద్ద గ్లోబల్ ఈవెంట్‌లో 1500 మంది మహిళా వ్యాపారవేత్తలు పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. మహిళా పారిశ్రామిక వేత్తలకు మూలధనం, వనరులు, సమాన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయ‌న స‌ల‌హాదారు ఇవాంకా అన్నారు. వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా మాట్లాడిన ఆమె హైద‌రాబాద్ మీద ప్ర‌శంస‌లు కురిపించారు.

భార‌తీయులే మాకు స్ఫూర్థి అని .. భార‌త్ నిజ‌మైన స్నేహితుడు అని త‌న తండ్రి చెబుతుంటార‌ని ఇవాంకా వెల్ల‌డించింది. ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశం భార‌త్ అని, భార‌త్ – అమెరికాల మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని ఆమె అన్నారు. మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది సదస్సు జరుగుతున్నదని మహిళా పారిశ్రామిక వేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్ మీద ఇవాంకా అభినంద‌న‌లతో ముంచెత్తారు. ఇది ఏషియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్ అని, ఇప్పుడు మీ టెక్నాలజీ సెంటర్లు వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ బిర్యానీని కూడా మించిపోయే స్థాయికి చేరుతాయని ఇవాంకా కొనియాడారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల ఇక్కడే చదువుకున్నారని ఈ సందర్భంగా ఇవాంకా గుర్తు చేశారు.

(Visited 263 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *