November 28, 2017

ఇంక్యుబేట‌ర్ ఇండియా

భారత్ – అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించడమే జీఈఎస్ లక్ష్యం. ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే స్టార్ట‌ప్ ఇండియా ల‌క్ష్యం. జీఈఎస్‌లో 50 శాతానికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలే ఉన్నారు. హిళాభివృద్ధి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ ర్యాంకు మెరుగుపడింది. 100 ర్యాంకుతో మేము సంతృప్తిగా లేము. 50వ ర్యాంక్ ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న జీఈఎస్ -2017 స‌ద‌స్సులో ఆయ‌న‌ ప్రసంగించారు. ఆవిష్కరణలు, వ్యాపారవేత్తలకు ఇండియా ఇంక్యూబేటర్‌గా పని చేస్తుందని చెప్పారు. అనేక అడ్డంకులు సృష్టించే పాత చట్టాలను చెత్త బుట్టలో వేశామన్నారు.

భార‌తీయులే మాకు స్ఫూర్థి

హైదరాబాద్‌లాంటి పురాతన నగరం ఇంత పెద్ద‌ టెక్నాలజీ హబ్‌గా ఎదగడం చాలా గొప్ప విషయం. తొలిసారి ఇంత పెద్ద గ్లోబల్ ఈవెంట్‌లో 1500 మంది మహిళా వ్యాపారవేత్తలు పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. మహిళా పారిశ్రామిక వేత్తలకు మూలధనం, వనరులు, సమాన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయ‌న స‌ల‌హాదారు ఇవాంకా అన్నారు. వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా మాట్లాడిన ఆమె హైద‌రాబాద్ మీద ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌తీయులే మాకు స్ఫూర్థి అని .. భార‌త్ నిజ‌మైన స్నేహితుడు అని త‌న తండ్రి

తెలంగాణ‌ పెట్టుబ‌డుల స్వ‌ర్గ‌ధామం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి లభిస్తుంది. టీఎస్ ఐపాస్ విశిష్టమైన విధానం. గ‌త మూడేళ్ల‌లో 5,469 ఇండస్ట్రియల్ యూనిట్లకు అనుమతి ఇచ్చాం. కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాం. పెట్టుబ‌డుల‌కు తెలంగాణ స్వ‌ర్గ‌ధామం. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్)లో సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం చేశారు. వ్యక్తిగతంగా సదస్సుకు వచ్చిన వారిని స్వాగతించడం సంతోషంగా ఉందని, జీఈఎస్ సదస్సును ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ తెలంగాణకు నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందని, ఇప్పుడు తెలంగాణ.. ఇంటర్నేషనల్, డొమెస్టిక్

బాబు గ‌ట్టి పైర‌వే చేశాడు

అమెరికా అధ్య‌క్షుడి కూతురు ఇవాంక ట్రంప్ అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ స‌ద‌స్సును నిర్వ‌హించేందుకు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు ముందుకు వ‌చ్చాయి. అయితే అమెరికా మాత్రం హైద‌రాబాద్ నే ఎంచుకుంది. అంత‌ర్జాతీయ స్థాయిని ఆక‌ర్షించిన ఈ స‌ద‌స్సును ఆంధ్రాలో నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు నాయుడు గ‌ట్టి పైర‌వే చేశాడ‌ట‌. ఏకంగా అమెరికా కాన్సులేట్ అధికారుల‌నే క‌లిసి ఆంధ్రాలో నిర్వ‌హించేలా ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. ఒప్పుకుంటే అమ‌రావ‌తి లేదా విశాఖ‌లో దీనిని నిర్వ‌హిస్తామ‌ని అన్నార‌ట‌. కానీ అమెరికా మాత్రం హైద‌రాబాద్ లో నిర్వ‌హించేందుకే మొగ్గుచూపింద‌ట‌. అమ‌రావ‌తిలో జరిగితే అమెరికా కంపెనీల‌ను ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని భావించార‌ట‌. కానీ బాబు ప్ర‌య‌త్నాలు

మ‌న ప్ర‌ధానితో ఇవాంకా

గ్లోబల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్ (జీఈఎస్)లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ మెట్రో రైలు ప్రారంభోత్సవం తర్వాత నేరుగా హెచ్‌ఐసీసీకి వెళ్లిన మోదీ.. మొదట ఇవాంకాతో సమావేశమయ్యారు. ఇవాంకా, మోదీతోపాటు రెండు దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాంకా అంతకుముందు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తోనూ భేటీ అయ్యారు.

మెట్రో స్టార్ట్ .. మోడీ ట్విస్ట్

హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రారంభ‌మ‌యింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ క‌లిసి మెట్రో పైలాన్ ను ఆవిష్క‌రించి ప్రారంభించారు. మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్రో యాప్, బ్రోచర్‌ను మోదీ విడుదల చేశారు. ఆ తర్వాత మెట్రో ప్రాజెక్టు ఆడియో విజువల్‌ను ప్రధాని వీక్షించారు. ఈ సంధ‌ర్భంగా ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. మెట్రో రిబ్బ‌న్ క‌ట్ చేయ‌డానికి ముందు ప్ర‌ధాన‌మంత్రి మోడీ కేటీఆర్ కోసం వెతికారు. కేటీఆర్ మోడీ ప‌క్క‌నే ఉన్న విష‌యాన్ని గుర్తించి ఆ త‌రువాత రిబ్బ‌న్

2018కి కాళేశ్వ‌రం

తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం నుండి అడ్డంకులు తొల‌గ‌డంతో 2018లోనే ప్రాజెక్టు పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. ఈ మేర‌కు నిన్న రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు కీలక స‌మీక్ష నిర్వ‌హించారు. ప్యాకేజి 10 నుంచి ప్యాకేజీ 14 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ,భూసేకరణ, పునరావాసం, సబ్ స్టేషన్లు , విద్యుత్ లైన్ల నిర్మాణం తదితర అంశాలపై ఉద‌యం 10 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌ల‌సౌధ‌లో చ‌ర్చించారు. గత 15 రోజుల్లోనే హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, అటవీ, భూగర్భ జల శాఖ , క‌న్ స్ట్ర‌క్ష‌న్

ఇవాంకా వ‌చ్చేసింది

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్ ఈ తెల్ల‌వారుజామున శంషాబాద్ విమానాశ్ర‌యంలో అడుగుపెట్టారు. రాష్ట్ర మంత్రులు, అధికారులు ఆమెకు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డి నుండి ఆమె మాదాపూర్ లోని ట్రెడెంట్ హోట‌ల్ కు బ‌య‌లు దేరారు. ఈ మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు ఆమె హెచ్ఐసీసీకి చేరుకుంటారు. అక్క‌డ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అవుతారు. మియాపూర్ లో మెట్రో రైలు ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ హెలికాప్టర్ ద్వారా హెచ్ఐసీసీ వేదికకు వస్తారు. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా ఇవాంక‌ కలుస్తారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభించిన తర్వాత ప్ర‌ధాన‌మంత్రి మోడీతో క‌లిసి పాతబస్తీలోని