పాల‌పిట్ట పార్క్ ప్రారంభ‌మ‌యింది

పాల‌పిట్ట పార్క్ ప్రారంభ‌మ‌యింది

కొత్తగూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్‌ గార్డెన్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన పాలపిట్ట పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పార్క్‌ వద్ద కాలుష్య వాతావరణం లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒక‌ప్పుడు పిచ్చిమొక్క‌ల‌తో ఉన్న ఈ ప్రాంతాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దారు. హరిత‌హారంలో భాగంగా ఏడు వేల మొక్క‌లు నాటారు.

సైక్లింగ్‌ కోసం వచ్చే వారికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 230 కొత్త సైకిళ్లు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం విశాలమైన సైకిల్‌ స్టాండ్‌ నిర్మించారు. రోజూ ఉదయం 6-9 గంటల మధ్య, సాయంత్రం 4-6 గంటల మధ్య పార్కులో సైకిల్‌ తొక్కవచ్చు. గంటపాటు సైక్లింగ్‌ చేసేందుకు పెద్దలు రూ.50, పిల్లలు రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సొంత సైకిల్‌ తెచ్చుకుంటే గంటకు రూ.25 చెల్లించాలి. నెలవారీ పాసుల కోసం రూ.800 చెల్లించాలి.

(Visited 179 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *