గిరిజ‌నుల‌కు కేసీఆర్ వ‌రాలు

గిరిజ‌నుల‌కు కేసీఆర్ వ‌రాలు

విద్యుత్ విజిలెన్స్ కేసులు మాఫీ. 70 కోట్ల విద్యుత్ బ‌కాయిలు మాఫీ. గొర్రెల యూనిట్లు ఇచ్చేందుకు నిర్ణ‌యం. ప్ర‌తి తండాకు ర‌హ‌దారి. రూ.125కు విద్యుత్ క‌నెక్ష‌న్. 50 యూనిట్ల లోపు విద్యుత్ కు ఎలాంటి ఛార్జ్ లేదు. ప్ర‌తి ఇంటికి స‌ర్వీస్ వైరు. ఇంటిలోప‌ల వైరింగ్ తో పాటు రెండు లైట్ల ఏర్పాటు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గిరిజ‌నుల‌కు వ‌రాలు ప్ర‌క‌టించారు.

రాష్ట్రవ్యాప్తంగా 9,737 ఎస్టీ ఆవాస ప్రాంతాలుండగా 8,734 ఆవాసాల్లో త్రీఫేజ్ కరంటు లేదని.. సమైక్యరాష్ట్రంలో నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ అని, ప్రతి ఎస్టీ ఇంటికి, ఎస్టీ వ్యవసాయదారుడికి, ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాదారులకు విద్యుత్ కనెక్షన్ కల్పించనున్నట్టు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఎస్టీ ఆవాసాలన్నింటికీరహదారి సౌకర్యం కల్పించేందుకు వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను ఆదేశించారు. ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్ కేసులు ఎత్తేయాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును ఆదేశించారు.

(Visited 64 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *