భార‌మైనా భ‌రిస్తాం

భార‌మైనా భ‌రిస్తాం

వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల క‌రంటు అందించేందుకు ప్ర‌భుత్వం ఎంత‌టి భారాన్ని అయినా భ‌రిస్తుంది. వ్య‌వ‌సాయానికి విద్యుత్ స‌బ్సిడీలు ఇవ్వడాన్ని ఆర్థిక‌వేత్త‌లు వ్య‌తిరేకిస్తున్నారు. కానీ నాకు ఆ ఆలోచ‌న లేదు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్ అందించడంకోసం ప్రభుత్వ సబ్సిడీని రూ.4777 కోట్ల నుంచి రూ.5400 కోట్లకు పెంచుతున్నాం. అవసరమైతే అదనంగా మరో రూ.500 కోట్లు ఇవ్వడానికీ సిద్ధం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే దాదాపు రూ.10 వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీల వల్ల ఏటా రూ.లక్ష కోట్ల విలువైన వ్యవసాయోత్పత్తులు వస్తాయి. అప్పుడు రైతుల పరిస్థితి మారుతుంది. రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా తీరు, జనవరి ఒకటి నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ అంశంపై కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో శనివారం సమీక్షించారు. దీనికి అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.

1300 పంపుసెట్లు.. 10-12 వేల మెగావాట్లు

గోదావరిపై కాళేశ్వరం, సీతారామ, దేవాదుల వంటి పథకాలతోపాటు గూడెం, శ్రీపాద, ఎల్లంపల్లివంటి చిన్న ఎత్తిపోతల పథకాలు, కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి, డిండివంటి ఎత్తిపోతల పథకాలు ఉపయోగంలోకి రానున్నాయి. ఎత్తిపోతల పథకాలతో పాటు మిషన్ భగీరథకోసం ఏర్పాటు చేసిన 1300 పంపుసెట్లకు అవసరమైన విద్యుత్‌ను అందించాల్సి ఉంటుంది అని ముఖ్య‌మంత్రి అధికారులకు చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు, మిషన్ భగీరథకు కలిపి 10నుంచి 12 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ అవసరముంటుందని అంచనా వేశారు. పంప్‌హౌజ్‌లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు జనవరి ఒకటి నుంచి నిరంతరాయం గా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అనధికార పంపుసెట్లు కూడా ఉన్నాయి. యాసంగిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడమన్నది చాలా ముఖ్యమైనది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయాన్ని అధికారులు గుర్తించాల‌ని కేసీఆర్ అన్నారు.

(Visited 90 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *