50 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చేసిన హీరో

50 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చేసిన హీరో

తెలుగు హీరోల సంగ‌తి ఏం చెబుతాం గానీ .. త‌మిళ హీరోలు సామాజిక బాధ్య‌త‌ను నెర‌వేర్చే తీరు మాత్రం అభినందించ‌ద‌గిందే. హీరో విశాల్ రైతుల‌ను ఆదుకున్న తీరు ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం చూశాం. తాజాగా త‌మిళ హీరో విజ‌య్ సేతుపతి త‌న‌కు ఓ ప్ర‌క‌ట‌న మూలంగా వ‌చ్చిన రూ.50 ల‌క్ష‌ల‌ను విరాళంగా ఇచ్చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు.

దిండుగల్ లో ‘అనిల్‌ సేమియా’ కంపెనీకి చెందిన ఐదు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించిన విజయ్ సేతుపతి .. త‌న‌కు వ‌చ్చిన పారితోషికం విరాళంగా ఇచ్చేశాడు. అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా తమిళనాట పేరొందిన అరియలూర్‌ లోని 774 అంగన్వాడీలు, 10 అంధుల పాఠశాలలు, 11 బధిర పాఠశాలలకు విరాళంగా ఇచ్చేశారు. ఒక్కో అంగన్వాడీకి 5,000 రూపాయలిచ్చిన సేతుపతి, ఒక్కో అంధుల, బధిర పాఠశాలకు 50,000 రూపాయల చొప్పున విరాళంగా ఇచ్చారు.

(Visited 366 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *