కొత్త డీజీపి మ‌హేంద‌ర్ రెడ్డి

కొత్త డీజీపి మ‌హేంద‌ర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి డీజీపీగా హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ మహేందర్ రెడ్డి నియామకం ఖరారైంది. ఎంతో మంది పేర్లు వినిపించినా హైదరాబాద్ సీపీగా ఉన్న మహేందర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపించింది. మ‌రో ఐదు సంవ‌త్స‌రాలు స‌ర్వీస్ ఉన్న మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కం దాదాపు ఖ‌రార‌యిన‌ట్లే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్.. స్వయంగా ఆయన్నే పిలిచి చెప్పారు. నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం ఇన్ చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు మహేందర్ రెడ్డి.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపూర్ గ్రామం మహేందర్ రెడ్డిది. రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆరుగురు సంతానంతో ఆయన అందరి కంటే చిన్నవారు. ఈయనకి ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు ఉన్నారు. ఏడో తరగతి వరకు కూసుమంచి గ్రామంలోనే విద్యాభ్యాసం. ఆ తర్వాత గురుకుల పాఠశాల ఎంట్రెన్స్ లో టాపర్ నిలిచారు. గురుకుల పాఠశాలలోనే తన జీవితం మలుపు తిరిగిందని తరచూ చెబుతున్నాంటారాయన. పదో తరగతి, ఇంటర్ లోనూ టాపర్ గా నిలిచారు. ఇంజినీరింగ్ ఎంట్రన్స్ లో మంచి మార్కులతో.. వరంగల్ ఆర్ఈసీ సివిల్ ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో సివిల్స్ కోచింగ్ తీసుకున్న ఆయ‌న మొద‌టిసారే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యారు.

1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయ‌న‌ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పని చేశారు. అంచెలు అంచెలుగా ఎదుగుతూ డీజీపీ స్థాయికి వచ్చారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సైబరాబాద్ కమిషనర్ ఏర్పాటు అవుతూనే తొలి కమిషనర్ గా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. తొలి హైదరాబాద్ కమిషనర్ కూడా ఈయనే. కమిషనర్ నుంచి డీజీపీగా ప్రమోట్ అయిన వారిలో మహేందర్ రెడ్డి మూడో వ్యక్తి. హైదరాబాద్ కమిషనర్ గా పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించారు.

(Visited 172 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *