చేతులెత్తేసిన చైనా .. మూడు న‌గ‌రాల‌కు ముప్పు

చేతులెత్తేసిన చైనా .. మూడు న‌గ‌రాల‌కు ముప్పు

అంత‌రిక్షంలో ఉన్న చైనా స్పేస్ స్టేష‌న్ అదుపు త‌ప్పింది. చైనా అంత‌రిక్షంలో ప్ర‌వేశ‌పెట్టిన టియాన్ గాంగ్ స్పేస్ స్టేష‌న్ భూమి వైపు దూసుకు వ‌స్తుంది. 8.5 టన్నుల బ‌రువున్న ఈ స్పేస్ స్టేష‌న్ ఇప్పుడు ఎక్క‌డుంది ? ఎప్పుడు ? ఎక్క‌డ కూలుతుంది ? అన్న వివ‌రాలు చెప్ప‌లేమ‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. స్పేస్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయాయని చైనా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐక్యరాజ్యసమితికి వెల్లడించింది.

ఈ స్పేస్ స్టేషన్ అమెరికాలోని న్యూయార్క్‌, చైనాలోని బీజింగ్‌, జపాన్‌ లోని టోక్యో నగరాల్లో కూలే అవకాశం ఉందని, ఇవి కాకుండా కాకుండా లాస్‌ ఏంజెలిస్‌, ఇస్తాంబుల్‌, రోమ్‌ లకు కూడా ప్రమాదం పొంచివుందని చెబుతున్నారు. ఇవి కాకుండా మ‌రో చోట కూడా కూలే అవ‌కాశం ఉంద‌ని, అయితే ఆ స్పేస్ స్టేష‌న్ భూ వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించ‌డానికి రెండు గంట‌ల ముందు మాత్రం చెప్ప‌గ‌ల‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. చైనా ఇచ్చిన స‌మాచారంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొంది.

(Visited 731 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *