వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ

వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ

రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబసంక్షేమ శాఖలో 1261 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ బుధవారం ఆరు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో స్టాఫ్‌నర్సు ఖాళీలు 1196, ఫిజియోథెరపిస్టులు 6, రేడియోగ్రాఫర్లు 35, పారామెడికల్ ఆఫ్తాల్మిక్ ఆఫీసర్లు 2, రిఫ్రాక్షనిస్ట్ 1, హెల్త్ సూపర్‌వైజర్లు 21 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ జోనల్ వేకెన్సీలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ కొలువుల భర్తీకి ఈ నెల 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, డిసెంబర్ 11తుది గడువని పేర్కొన్నది. 2018 జనవరిలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించింది.

(Visited 30 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *