స‌మైక్య‌పాల‌న‌లో దుర్మార్గ‌పు ప్ర‌చారం

స‌మైక్య‌పాల‌న‌లో దుర్మార్గ‌పు ప్ర‌చారం

తెలంగాణ‌కు చ‌రిత్ర లేదంటూ స‌మైక్య పాల‌కులు దుర్మార్గ‌మైన ప్ర‌చారం చేశారు. తెలంగాణ చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారు. న‌న్ను కొంద‌రు ఇప్ప‌టికీ న‌యా నైజాం రాజు అంటూ విమ‌ర్శ‌లు చేస్తారు. తెలంగాణ అంటే రజాకార్లు చ‌రిత్ర అని ప్ర‌చారం చేస్తార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో మైనార్టీల అభివృద్ది గురించి జ‌రిగిన స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌లో ఆయ‌న పాల్గొన్నారు. తెలంగాణ చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ‌లు పోగొట్టే బాధ్య నామీద ఉంద‌ని కేసీఆర్ అన్నారు.

గ‌తంలో నేను నిజాం రాజు స‌మాధిని సంద‌ర్శిస్తే ఎందుకు వెళ్లార‌ని అన్నారు. మ‌రి ఆంధ్రాలో 200 ఏళ్లు దేశాన్ని ఏలిన తెల్ల‌దొర‌ల‌ను ఎలా కీర్తిస్తారు ? కాట‌న్ దొర ఉత్స‌వాలు ఎందుకు చేస్తార‌ని అప్ప‌ట్లో నేను ప్ర‌శ్నించాన‌ని కేసీఆర్ గుర్తు చేశారు. మ‌రి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నిజాం సాగ‌ర్ అని పేరు ఎందుకు పెట్టార‌ని ప్ర‌శ్నించారు. ముస్లింల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తామ‌ని, రిజ‌ర్వేష‌న్ల సాధ‌న‌కు ప్ర‌య‌త్నిస్తామ‌ని అన్నారు.

(Visited 291 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *