బ‌త‌కాలంటే ఢిల్లీ వ‌ద‌లండి

బ‌త‌కాలంటే ఢిల్లీ వ‌ద‌లండి

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి చేరింది. కాలుష్యాన్ని కొలిచే చార్టులో సున్నా నుంచి 500 వరకూ రీడింగ్ ఉంటుంది. ఇందులో రీడింగ్ 100 దాటితే ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరినట్టు. 400 దాటితే ఊపిరితిత్తులకు ప్రమాదక‌రం. రెండు రోజుల క్రితం 471 ఉన్న‌ ఈ రీడింగ్ ఇప్పుడు మరింతగా పెరిగి 726 స్థాయికి చేరింది. ఊపిరితిత్తులను నాశనం చేసి, శ్వాస కోశ వ్యవస్థను దెబ్బతీసే పీఎం (పర్టికులేట్ మ్యాటర్) 2.5 ఢిల్లీ వాతావరణంలో ఉన్న గణాంకాలివి. యూఎస్ ఎంబసీలోని పొల్యూషన్ మానిటర్ ఈ గణాంకాలను వెల్లడించింది.

ఈ న గాలిని పీల్చడం మానవాళికి అత్యంత ప్రమాదకరమని, తక్షణం ఢిల్లీని వదిలి వెళితేనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య‌లు సూచిస్తున్నారు. కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు ఢిల్లీ వాసులు ఎయిర్ ప్యూరిఫయర్లను, ఫిల్ట్రేషన్ మాస్క్ లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 2 కోట్ల మంది ఈ గ్యాస్ చాంబర్ లో నివసిస్తున్నారని, సమస్య పక్క రాష్ట్రాల కారణంగా వస్తున్నందున వారితో చర్చిస్తున్నామని ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ అన్నారు. గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల‌లో ఈ ప‌రిస్థితి ఎన్న‌డూ క‌నిపించ‌లేద‌ని అధికారులు చెబుతున్నారు.

(Visited 285 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *