ఒరిగిపోయిన ‘ఒగ్గుచుక్క’

ఒరిగిపోయిన 'ఒగ్గుచుక్క'

తెలంగాణ ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య ఈ రోజు కన్నుమూశారు. 14 ఏండ్ల నుండే ఈ క‌ళ‌లో రాణిస్తున్న స‌త్త‌య్య దేశ‌వ్యాప్తంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 12 వేల‌కు పైగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. వీర‌భ‌ద్రుడి క‌థ, ప‌ర‌మ‌శివుని గొప్ప‌త‌నం గురించి చెప్పే ఆయ‌న సామాజిక అస‌మాన‌త‌ల మీద‌, విద్య‌, కుటుంబ నియంత్ర‌ణ‌, మూడ న‌మ్మ‌కాల మీద కూడా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆయ‌న స‌న్మానం అందుకున్నారు.

ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. సత్తయ్య 1935, మార్చి 29న జనగామ జిల్లా, లింగాల ఘన్‌‌పూర్‌ మండలం మాణిక్యపురం గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రిపేరు ఆగయ్య. 40 సంవత్సరాల ఒగ్గు కళా జీవితంలో 12 వేల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.

స‌త్త‌య్య‌ మల్లన్నకథ, బీరప్ప కథ, ఎల్లమ్మకథ, మాందాలు కథ, నల్ల పోషమ్మ కథ, కీలుగుర్రం కథ, లక్ష్యాగృహం కథ, పెద్దిరాజు కథ, ఎర్రగొల్ల అక్కమ్మకథ, కనకతార కథ, కాంభోజరాజు కథ, అల్లిరాణి కథ, గయోపాఖ్యానం, రంభ రంపాలా, అయిదు మల్లెపూల కథ, గౌడ పురాణం, సమ్మక్క కథ, మండోదరి కథ, ఇప్పరాపురిపట్నంకథ, సూర్యచంవూదాదుల కథ, బాలనాగమ్మ కథ, సత్యహరిశ్చంద్ర మహారాజు కథ, సత్యవతి కథ, సిరికొండ మహారాజు కథ, రామాయణం, మయసభ, కంసవధ, భస్మాసుర వధ, భక్త ప్రహ్లాద మొదలైన కథలను ఒగ్గుకథలుగా చెప్పేవారు.

తెలంగాణతో పాటు యావత్‌ దేశం గర్వించదగ్గ కళాకారుడిగా చుక్కా సత్తయ్య ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారని, ఆయన మరణం తీరని లోటని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. చుక్కా స‌త్త‌య్య మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు.

(Visited 93 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *