ఆఖ‌రిపంచ్ అక్బ‌రుద్దీన్ ది అయితే ..

ఆఖ‌రిపంచ్ అక్బ‌రుద్దీన్ ది అయితే ..

తెలంగాణ ఇచ్చింది మేమే .. తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ఇచ్చింది మేమే .. తెలంగాణ‌కు మ‌ద్ద‌తుగా లేఖ ఇచ్చింది మేమే .. తెలంగాణ‌కు ఎవ‌రు తెచ్చారు ? ఎవ‌రు ఎందుకు ఇచ్చారు ? ఇవ్వాల్సిన ప‌రిస్థితులు ఎవ‌రు క‌ల్పించారు అన్న‌దానికి శాస‌న‌స‌భ సాక్షిగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్య‌మంలో ఎవ‌రి పాత్ర ఏంటి ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎవ‌రి కృషి ఎంత ? అని వివరించారు. ఇన్నాళ్లు తెలంగాణ తెచ్చాం .. ఇచ్చాం అని చెప్పుకున్న వాళ్ల‌కు నోరుమెద‌ప‌లేని స‌మాధానం ఇచ్చాడు అక్బ‌రుద్దీన్. తెలంగాణ ఏర్పాటు .. కేసీఆర్ పాత్ర గురించి అక్బ‌రుద్దీన్ మాట‌ల్లోనే ..

ముఖ్య‌మంత్రి పదవి కేసీఆర్ స్థాయికి చాలా చిన్నదని, మజ్లిస్ పార్టీ ఎప్పుడూ కేసీఆర్‌ను కేవలం ముఖ్యమంత్రిగానే గౌరవించలేదు. ఎందుకంటే.. కేసీఆర్ స్థాయికి సీఎం పదవి చాలా చిన్నది. కేసీఆర్ తెలంగాణను సాధించారు. అది చిన్న విషయం కాదు. తెలంగాణకోసం కేసీఆర్‌కు మద్దతిచ్చాం.. కలిసివచ్చాం అని ఎవరైనా అంటే.. అది నిజం కాదు. కేసీఆర్ బలం, ప్రణాళికలు, వ్యూహరచనలతోనే తెలంగాణ సాధ్యమైంది. మీరు (కాంగ్రెస్) కూడా కలిసిరాక తప్పలేదు అని చెప్పారు. కాంగ్రెస్‌వాళ్లు తాము, తమ లీడర్ తెలంగాణ ఇచ్చినట్టు చెప్పుకొంటున్నారు. మీరు ఇవ్వలేదు.. ఇవ్వాల్సి వచ్చింది. మీరు మీ లీడర్‌కు ఏం ఇచ్చారు? ఈ ప్రదేశం (ప్రతిపక్ష స్థానం)ఇచ్చారా అని ఎద్దేవాచేశారు.

ఇన్నాళ్లు మైనార్టీల‌ను రాజ‌కీయం కోసం వాడుకున్న పార్టీల‌కు ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం వారి అభివృద్దికోసం ప‌నిచేస్తున్న తీరును వివ‌రించి ఆఖ‌రుకు తెలంగాణ సాధ‌న‌కు కేసీఆర్ కృషి ఏంటి అన్న‌ది కూడా వివ‌రించ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి క‌ల్పించింది.

(Visited 833 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *