కేసీఆర్ లాంటి ముఖ్య‌మంత్రి లేడు

కేసీఆర్ లాంటి ముఖ్య‌మంత్రి లేడు

అనేక మంది ముఖ్య‌మంత్రులు పూజ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు. ఆ త‌రువాత బొట్టు తుడుచుకున్నంత వేగంగా దానిని విస్మ‌రిస్తారు. కానీ కేసీఆర్ మాత్రం అలా కాదు. అలాంటి ముఖ్య‌మంత్రి మ‌రొక‌రు లేరు. త‌క్కువ‌గా మాట్లాడి ఎక్కువ ప‌ని చేస్తారు అని విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా వరంగల్ వేయి స్తంభాల గుడిలో రుద్రేశ్వరుడి లక్ష బిల్వార్చనలో పాల్గొన్నారు. అంతకుముందు స్వామివారికి క్షీరాభిషేకం చేశారు.

దేశం లో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాల కోసం ఆయుత చండీయాగం చేసి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని స్వామి అన్నారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కట్టడాలను కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి పునరుజ్జీవింప చేయాలని కోరారు.

తెలంగాణలో వేలాది దేవాలయాల్లో దూపద్వీప నైవేద్యాల కోసం చేపట్టిన బృహత్తర కార్యక్రమాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయడం, దాదా పు రూ.200 కోట్లు కేటాయించి వైదిక సంప్రదాయాలను పరిరక్షిస్తున్న సీఎం దేశంలో ఒక్క కేసీఆర్ మాత్రమేనని ఆయన ప్రశంసించారు. రాజ్యసభ సభ్యుడు, తమ పీఠం భక్తుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆహ్వానం, వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ కోరిక మేరకు తానిక్కడికి వచ్చానన్నారు. వేయి స్తంభాల గుడిలో పరమశివుడికి అభిషేకం చేస్తుంటే సాక్షాత్తు ఆ శివపార్వతులే వచ్చి స్వీకరించారా..? అన్నంత అనుభూతి కలిగిందని అన్నారు.

(Visited 600 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *