వాస్తు శిల్పి బీఎన్ రెడ్డి క‌న్నుమూత‌

వాస్తు శిల్పి బీఎన్ రెడ్డి క‌న్నుమూత‌

మాజీ పార్లమెంటు సభ్యులు, వాస్తు శిల్పి బి.ఎన్. రెడ్డి(86) సోమవారం ఉదయం మరణించా రు. ఆయన భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలలో భార్య అలివేలు, కుమారుడు బి.సి.రెడ్డి కొంత కాలం క్రితం మృతిచెందారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 1931లో బి.ఎన్. రెడ్డి జన్మించారు. ఆయన మృధుభాషి, స్నేహశీలి. ఉస్మానియాలో ఇంజినీరింగ్, అమెరికా కొలోరాడో విశ్వవిద్యాలయంల నుండి ఎం.ఎస్. పట్టా స్వీకరించారు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(సిబిఐటి) సొసైటీకి చాలా కాలం చైర్మన్‌గా పని చేశారు. ఆయన మృతికి సంతాపంగా సిబిఐటికి సోమవారం సెలవు ప్రకటించి, పరీక్షలను వాయిదా వేశారు.

హైదరాబాద్ నగరంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు జనతా ఫ్లాట్స్ నిర్మించడంలో, నగరంలో పలు గృహ నిర్మాణ కాలనీలు, కాంప్లెక్సులు నిర్మించడంలో బి.ఎన్.రెడ్డి పేరుగాంచారు. ఆయన రెండు పర్యాయాలు (1989,1996) మిర్యాలగూడ నియోజకవర్గం నుండి లోకసభకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు. పలు సాంస్కృతిక, కళారంగాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు నెలకొల్పారు. స్వయాన బి.ఎన్.రెడ్డి కవి. పలు కవితలు రాశారు. సామాన్యుని సందేశం, బిఎన్ సుభాషితాలు ప్రసిద్ధి కెక్కాయి. బి.ఎన్.రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ‘మహాప్రస్థానం’లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

(Visited 55 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *