న‌వ శ‌కానికి కేసీఆర్ నాంది

న‌వ శ‌కానికి కేసీఆర్ నాంది

రైతే రాజు… జై జ‌వాన్ … జై కిసాన్ ఇవి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి వింటున్న నినాదాలే. ప‌ట్టుద‌ల ఉంటే కానిది లేదు ఇది చిన్న‌ప్ప‌టి పాఠ్య‌పుస్తకాల‌లో చ‌దువుకున్న పాఠ‌మే. కానీ ఈ దేశంలోని ఏ పాల‌కులు స‌మ‌కాలీన రాజ‌కీయాల‌లో రైతుకు పెద్ద‌పీట వేసి రైతే రాజు అయ్యేందుకు రూపొందించిన ప్ర‌ణాళిక‌లు లేవు. అమ‌లు ప‌రిచిన విధానాలు లేవు. అలాంటి ఒక క‌ల ఈ రోజు తెలంగాణ రైతుల‌కు నెర‌వేరింది. రాజ్యాంగానికి లోబ‌డి తెలంగాణ ఉద్య‌మాన్ని 14 ఏండ్లు అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ‌ను సాధించ‌డం ఒక ఎత్త‌యితే .. ఆ త‌రువాత కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు.. అమ‌లు చేస్తున్న విధానాలు ఒక ఎత్తు. ఆయ‌న సాగించిన తెలంగాణ ఉద్య‌మం ప్ర‌పంచ పోరాటాల చ‌రిత్ర‌కు ఒక దిక్సూచి. ఇప్పుడు తెలంగాణ‌లో రైతును రాజును చేసే ప్ర‌ణాళిక‌లో భాగంగా ఓ గొప్ప ప్ర‌స్థానానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాంది ప‌లికారు. అదే వ్య‌వ‌సాయానికి ఉచితంగా 24 గంట‌ల క‌రంటు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి గ‌త అర్ధ‌రాత్రి నుండి వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల‌ విద్యుత్ స‌ర‌ఫ‌రా మొద‌ల‌యింది.

స‌మైక్య రాష్ట్రంలో ఎగువ‌న ఉన్న తెలంగాణ‌కు నీళ్లు రావు అంటూ ఆంధ్రా పాల‌కులు చెప్పుకుంటూ పోతే .. తెలంగాణ నేత‌లు వినుకుంటూ పోయారు. వ్య‌వ‌సాయ‌మే జీవితంగా బతుకుతున్న రైతులు బ‌తుకుదెరువు లేక వ‌ల‌స‌ల బాట ప‌ట్టిండ్రు. ఉన్న కొంద‌రు అప్పో సొప్పో చేసి బోర్లు వేసి వ్య‌వ‌సాయం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో ల‌క్ష‌ల బోర్లు వేశారు. ఏడాదికేడాది వ‌ర్ష‌పాతం త‌గ్గ‌డం .. భూగ‌ర్భ జ‌లాలు పెర‌గ‌డానికి ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం మూలంగా బోర్లు వేసి వేసి అప్పుల పాలై ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న అన్న‌దాత‌లు ఎంద‌రో. ఇక క‌ష్ట‌ప‌డి బోర్లు వేసుకున్నా క‌రంటు నిరంత‌రాయంగా అంద‌క .. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు ఆరుగంట‌లు .. మూడుగంట‌లు అయినా స‌రిగ్గా ఇవ్వ‌క పంట‌లు ఎండి ప్రాణాలు తీసుకున్న రైతులు ఎంద‌రో. ఇక క‌రంటు బిల్లులు క‌ట్ట‌లేద‌ని స్టార్ట‌ర్లు, బోరు మోట‌ర్లు విద్యుత్ శాఖ లాక్కుని పోతుంటే గోస ప‌డ్డ రైతుల దీన‌స్థితి వ‌ర్ణ‌నాతీతం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏకంగా 23 ల‌క్ష‌ల పంపుసెట్లు ఉండ‌డం గ‌త పాల‌కులు తెలంగాణ మీద చూపిన వివ‌క్ష‌కు సాక్ష్యంగా నిలుస్తుంది.

ఈ క్ర‌మంలో నీళ్లు, నిధులు, నియామ‌కాలు ల‌క్ష్యంగా తెలంగాణ ఉద్య‌మం మొద‌లుపెట్టిన కేసీఆర్ ఎక్క‌డా వెన్ను చూప‌కుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల 60 ఏండ్ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చారు. తెలంగాణ వ‌చ్చిన వెంట‌నే ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు. తెలంగాణ వ‌స్తే క‌రంటు లేక చీక‌టిపాల‌వుతుంది అన్న స‌మైక్య ఆఖ‌రు ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి త‌ల‌దించుకునే విధంగా తెలంగాణ వ‌చ్చిన వెంట‌నే తొమ్మిదిగంట‌ల క‌రంటు స‌క్ర‌మంగా ఇచ్చేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆ త‌రువాత గ‌త ఏడాది 24 గంట‌ల క‌రంటు స‌ర‌ఫ‌రాకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఈ మేర‌కు విద్యుత్ సంస్థ‌లు రూ.12వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేశారు. గత జూన్ 17 నుంచి పాత మెదక్ జిల్లా పరిధిలో, జూన్ 18 నుంచి పాత కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రా ష్ట్రం మొత్తంమీద 23 లక్షలకు పైగా పంపుసెట్లుం టే, ఈ మూడు జిల్లాల పరిధిలో 9.58 లక్షల పంపుసెట్లున్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో మొత్తం 23 లక్షలకు పైగా ఉన్న పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వడం వల్ల మరో 1500-2000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అదనంగా వచ్చే అవకాశం ఉంది.

2014 జూన్ 2కు ముందు రాష్ట్రం లో 5,240 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆరు 400 కెవి సబ్ స్టేషన్లు మాత్రమే ఉండేవి. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి దా దాపు 13వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన 400 కెవి సబ్ స్టేషన్లు అవసరమని భావించిన విద్యుత్ శాఖ కొత్తగా 9 సబ్ స్టేషన్ల నిర్మాణం ప్రారంభించింది. వ్యవసాయం తో పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి దాదాపు 13వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన 400 కెవి సబ్ స్టేషన్లు అవసరమని భావించిన విద్యుత్ శాఖ కొత్తగా 9 సబ్ స్టేషన్ల నిర్మాణానికి పూనుకున్నది.

19 కొత్త 220 కెవి సబ్ స్టేషన్లు నిర్మించింది. 35 కొత్త 132 కెవి సబ్ స్టేషన్లు కూడా నిర్మించింది. దీంతో తెలంగాణ రాకముందు 233 ఇ.హెచ్.టి లైన్ల సామర్థ్యం కలిగిన సబ్ సస్టేషన్లు తెలంగాణలో ఉంటే, ఇప్పుడు 292 సబ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. లో ఓల్టేజి సమస్య రాకుండా ఉండడానికి కొత్తగా వేల సంఖ్యలో ట్రాన్స్ ఫార్మ ర్లు ఏర్పాటు చేశారు.

గ‌తంలో రైతు క‌రంటు స్థంబం కోసం అధికారుల చుట్టూ కాళ్ల‌రిగేలా తిరిగేది. ఇక ట్రాన్స్ ఫార్మ‌ర్ మంజూరు అంటే గగ‌న‌మే. స్థంబాలు లేక కిలోమీట‌ర్ల దూరం క‌ట్టెలు నాటుకుని క‌రంటు వైర్లు సొంతంగా గుంజుకున్న రైతులు ఎంద‌రో. గాలి వాన‌కు క‌ట్టెలు విరిగి విద్యుత్ వైర్లు తెగి కరంటు షాక్ తో మ‌ర‌ణించిన రైతులు, వ్య‌వ‌సాయ కూలీలు, మూగ‌జీవాలు అనేకం. తెలంగాణ రాక‌తో రైతుల‌కు ఆ దుస్థితి తొల‌గిపోయింది. ప్ర‌భుత్వమే ల‌క్ష‌ల సంఖ్య‌లో క‌రంటు స్థంభాలు నాటించింది. కొత్త లైన్లు తీయించింది. ఈ రోజు గ్రామీణ రైతులు క‌రంటు గురించి ఎక్క‌డా ఆందోళ‌న చేస్తున్న దాఖలాలు లేవు. 24 గంట‌ల క‌రంటు వ‌ద్ద‌ని ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారంటే వారి ప‌రిస్థితిని అర్ధం చేసుకోవ‌చ్చు.

క‌రంటు స‌ర‌ఫ‌రా చేయ‌డమే తెలంగాణ ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్పుకోవ‌డం లేదు. దానికి ముందే భూగ‌ర్భ‌జ‌లాలు పెరిగేందుకు .. ప‌డావుబ‌డ్డ బోర్లు ఊట‌ప‌ట్టేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకుంది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వ‌ర‌గా పూర్తి చేసింది. మిష‌న్ కాక‌తీయ‌తో చెరువుల‌ను ప‌టిష్టం చేసింది. కాలువ‌ల ద్వారా, వ‌ర్షాల మూలంగా చెరువులు నిండి అలుగులు పార‌డంతో స‌మీప బోర్ల‌న్నీ ఇప్పుడు ఊట‌ప‌ట్టి నిండుగా దుంకుతున్నాయి. ఏక‌కాలంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ఈ చ‌ర్య‌ల మూలంగా తెలంగాణ రైతు త‌న భ‌విష్య‌త్ మీద భ‌రోసాతో ఉన్నాడు. అన్న‌దాత‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ఆందోళ‌న‌లు చేయ‌డం కాదు. వారి స‌మ‌స్య శాశ్వ‌త ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాలి. దానికి తెలంగాణ ఆత్మ కావాలి. ఆలోచ‌న కావాలి. క్షేత్ర‌స్థాయిలో రైతు గురించిన అవ‌గాహ‌న కావాలి. దానిని అమ‌లు ప‌ర‌చాలి అన్న ఆత్మ‌స్థ‌యిర్యం కావాలి. అది తెలంగాణ ఉద్య‌మంలో స‌బ్బండ వ‌ర్గాల‌తో మ‌మేక‌మ‌యిన ఒక్క కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్యం. అందుకే ఆయ‌న ఈ రోజు తెలంగాణ‌లో ఒక న‌వ‌శ‌కానికి నాంది ప‌ల‌క‌గ‌లిగారు.

సందీప్ రెడ్డి కొత్త‌ప‌ల్లి

 

 

(Visited 405 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *