అమిత్ షా వ‌చ్చి అంద‌లం ఎక్కిస్తాడ‌నుకుంటే

అమిత్ షా వ‌చ్చి అంద‌లం ఎక్కిస్తాడ‌నుకుంటే

నోరు తెరిస్తే 2019లో అధికారం మాదే. టీఆర్ఎస్ కు ఈ రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయం మేమే అంటూ బీజేపీ రాష్ట్ర నేత‌లు మీడియా ముందు కిందా మీదా ప‌డి చెప్పుకుంటూ వ‌చ్చారు. ఆ మ‌ధ్య బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌స్తే ఒక జ‌డ్పీటీసీని చేర్చుకుని సంబ‌రాలు చేసుకున్నారు. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వ అండ‌తో తెలంగాణ‌లో ఎవ్వ‌రిన‌యినా ముగ్గులోకి దింపుతాం అని భ్ర‌మ‌ప‌డ్డారు. కానీ గ‌త కొన్నాళ్లుగా జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు రాష్ట్ర బీజేపీకే కాదు జాతీయ బీజేపీ శాఖ‌కు కూడా మింగుడు ప‌డ‌డం లేదు.

ఓటుకునోటు నిందితుడు రేవంత్ రెడ్డి భారీ అనుచ‌ర‌గ‌ణంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. రేవంత్ పార్టీ మార్పుతో కాంగ్రెస్ లాభం చేకూరుతుందా ? అంటే అది ఉత్త మాట అని అంద‌రికీ తెలిసిందే. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న త‌మ పార్టీలో కాకుండా కాంగ్రెస్ లో చేర‌డం బీజేపీకి మింగుడు ప‌డ‌డం లేదు. పోతూ పోతూ బీజేపీలో ఎందుకు చేర‌డం లేదు అని మీడియా ప్ర‌శ్నిస్తే అస‌లు రాష్ట్రంలో ఆ పార్టీ ఎక్క‌డుంది అని రేవంత్ అన‌డం బీజేపీ నేత‌ల‌కు త‌ల‌కొట్టేసిన‌ట్ల‌యింది.

తెలంగాణ‌లో బీజేపీ ఎన్న‌టికీ బ‌ల‌ప‌డలేదు. ఉన్న స్థానాలు కాపాడుకుంటే చాలు అన్న విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల‌లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే త‌మ వ‌ల్ల‌కాద‌ని విప‌క్ష పార్టీల నేత‌ల‌కు బోధ‌ప‌డింది. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం మీద‌, కేసీఆర్ మీద రంకెలేస్తున్న నేత‌లంతా తాము రాజ‌కీయ క్షేత్రంలో ఉండాలంటే క‌నీసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాలి అన్న ఆశ‌తో ఒక్క‌చోటికి చేరుతున్నారు. అయితే ప్ర‌త్యామ్నాయం అనుకున్న బీజేపీ వైపు మాత్రం ఎవ‌రూ చూడ‌డం లేదు. పార్టీలో ఉన్న కొంద‌రు బీజేపీ నేత‌లు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దం అవుతున్నార‌ని తెలుస్తుంది. అదే జ‌రిగితే బీజేపీలో మిగిలేది వేళ్ల మీద లెక్క పెట్ట‌గ‌లిగే వారు మాత్ర‌మే. అమిత్ షా వ‌చ్చి అంద‌లం ఎక్కిస్తాడ‌నుకుంటే రాష్ట్ర బీజేపీ అధంపాతాళంలోకి కూరుకుపోతుంది.

(Visited 417 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *