November 2017

మ‌న మెట్రో రికార్డు

ఆంధ్రా మీడియా దుష్ప్ర‌చారం, తెలంగాణ విప‌క్షాల విమ‌ర్శ‌లపై ప్ర‌జ‌లు నీళ్లు చ‌ల్లారు. హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలి రోజు ఏకంగా రెండు ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌యాణించారు. దేశంలోని ఇత‌ర న‌గ‌రాల‌లో ప్రారంభం రోజున తొలి రోజు 50 వేల మందికి మించి ప్ర‌యాణించిన దాఖ‌లాలు లేవు. అయితే ఏకంగా 30 కిలోమీట‌ర్ల ర‌హ‌దారిని అందుబాటులోకి తీసుకురావ‌డంతో పాటు అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలు పాటించి అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డంతో ప్ర‌జ‌లు మెట్రో రైలులో ప్ర‌యాణించడానికి ఉత్సాహం చూపుతున్నారు. photo credit by : సూర్య శ్రీధర్, తెలంగాణ టుడే ఫోటోగ్రాఫర్    Javvaji Venu Goud గారి

ప్ర‌శంస‌లు కురిపించిన ప‌రుచూరి

‘‘కేటీఆర్ గారూ.. ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు.. నిన్న జరిగిన ప్రపంచ వ్యాపార సదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు. అభినందనలండీ. మీ భాషణం అనితర సాధ్యం’’ అని ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మీద ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ థ్యాంక్యూ సార్ అని రిప్లై ఇచ్చారు. జీఈఎస్ రెండో రోజు మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు అనే అంశంపై జరిగిన ప్లీనరీకి కేటీఆర్ మాడరేటర్ గా వ్యవహరించారు. ఈ ప్లీనరీలో ప్యానలిస్టులుగా ఉన్న ఇవాంక ట్రంప్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్,

కేటీఆర్ డైన‌మిక్ లీడ‌ర్

“మెట్రో ప్రారంభంలో రిబ్బన్‌ కట్‌ చేసే ముందు ప్రధాని కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు. ఆయన వచ్చాక రిబ్బన్‌ కట్‌ చేయడం చూస్తుంటే… కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని చెప్పడానికి అది చాలుష అని ప్రముఖ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ అన్నారు. హైదరాబాద్ మెట్రోను జాతికి అంకితం చేస్తున్న వేళ జరిగిన ఆసక్తికర ఘటనపై హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. మియాపూర్ మెట్రో స్టేషన్ లో రిబ్బన్ కట్ చేసేముందు కేటీఆర్ ఎక్కడున్నాడని ప్రధాని స్వయంగా కేసీఆర్ ను అడగడం, ఆపై కేటీఆర్ వచ్చిన తరువాత రిబ్బన్ కట్ చేయడం మీడియాలో వైరల్ అయింది. ఈ

ప్రైవేటులోనే అవ‌కాశాలు

ప్రైవేటు రంగంలోనే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారని అందుకే ఆ రంగాన్ని ప్రోత్సహిస్తే మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో రెండో రోజు ‘మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు’ అంశంపై ప్లీనరీ నిర్వహించారు. ఇందులో ఇవాంక ట్రంప్‌, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ భార్య చెర్రీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచ్చర్‌, డెల్‌ ఈఎంసీ కరేన్‌ క్వింటోస్‌ పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు. పెరిగిన మహిళా భాగస్వామ్యం..

సాధించావు కేసీఆర్

రాజ‌కీయ నాయ‌కుల‌కు అవ‌కాశాలు రావ‌డం అరుదు. అదీ భార‌త్ లాంటి అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో, సంకీర్ణ రాజ‌కీయాల కాలంలో రావ‌డం మ‌రీ అరుదు. అలాంటిది ఒక రాజ‌కీయ నాయ‌కుని జీవిత‌కాలంలో రెండు సార్లు అవ‌కాశం రావ‌డం మరింత అరుదు. అలాంటి అవ‌కాశం ల‌భించిన అరుద‌యిన వ్య‌క్తి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్. తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌త్యేక రాష్ట్ర క‌ల‌ను నెర‌వేర్చగ‌ల‌గ‌డం మొద‌టి అవ‌కాశం. ఆ వ‌చ్చిన తెలంగాణ‌ను అభివృద్ది ప‌థంలో న‌డిపించ‌గ‌లిగే అవ‌కాశం ల‌భించ‌డం రెండో అవ‌కాశం. 2001లో తెలంగాణ రాష్ట్ర స‌మితిని స్థాపించి మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టిన కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను జాగృతం చేసే క్ర‌మంలో

ఇంక్యుబేట‌ర్ ఇండియా

భారత్ – అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించడమే జీఈఎస్ లక్ష్యం. ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే స్టార్ట‌ప్ ఇండియా ల‌క్ష్యం. జీఈఎస్‌లో 50 శాతానికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలే ఉన్నారు. హిళాభివృద్ధి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ ర్యాంకు మెరుగుపడింది. 100 ర్యాంకుతో మేము సంతృప్తిగా లేము. 50వ ర్యాంక్ ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న జీఈఎస్ -2017 స‌ద‌స్సులో ఆయ‌న‌ ప్రసంగించారు. ఆవిష్కరణలు, వ్యాపారవేత్తలకు ఇండియా ఇంక్యూబేటర్‌గా పని చేస్తుందని చెప్పారు. అనేక అడ్డంకులు సృష్టించే పాత చట్టాలను చెత్త బుట్టలో వేశామన్నారు.

భార‌తీయులే మాకు స్ఫూర్థి

హైదరాబాద్‌లాంటి పురాతన నగరం ఇంత పెద్ద‌ టెక్నాలజీ హబ్‌గా ఎదగడం చాలా గొప్ప విషయం. తొలిసారి ఇంత పెద్ద గ్లోబల్ ఈవెంట్‌లో 1500 మంది మహిళా వ్యాపారవేత్తలు పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. మహిళా పారిశ్రామిక వేత్తలకు మూలధనం, వనరులు, సమాన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయ‌న స‌ల‌హాదారు ఇవాంకా అన్నారు. వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)లో భాగంగా మాట్లాడిన ఆమె హైద‌రాబాద్ మీద ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌తీయులే మాకు స్ఫూర్థి అని .. భార‌త్ నిజ‌మైన స్నేహితుడు అని త‌న తండ్రి

తెలంగాణ‌ పెట్టుబ‌డుల స్వ‌ర్గ‌ధామం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి లభిస్తుంది. టీఎస్ ఐపాస్ విశిష్టమైన విధానం. గ‌త మూడేళ్ల‌లో 5,469 ఇండస్ట్రియల్ యూనిట్లకు అనుమతి ఇచ్చాం. కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాం. పెట్టుబ‌డుల‌కు తెలంగాణ స్వ‌ర్గ‌ధామం. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్)లో సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం చేశారు. వ్యక్తిగతంగా సదస్సుకు వచ్చిన వారిని స్వాగతించడం సంతోషంగా ఉందని, జీఈఎస్ సదస్సును ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ తెలంగాణకు నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందని, ఇప్పుడు తెలంగాణ.. ఇంటర్నేషనల్, డొమెస్టిక్

బాబు గ‌ట్టి పైర‌వే చేశాడు

అమెరికా అధ్య‌క్షుడి కూతురు ఇవాంక ట్రంప్ అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ స‌ద‌స్సును నిర్వ‌హించేందుకు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు ముందుకు వ‌చ్చాయి. అయితే అమెరికా మాత్రం హైద‌రాబాద్ నే ఎంచుకుంది. అంత‌ర్జాతీయ స్థాయిని ఆక‌ర్షించిన ఈ స‌ద‌స్సును ఆంధ్రాలో నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు నాయుడు గ‌ట్టి పైర‌వే చేశాడ‌ట‌. ఏకంగా అమెరికా కాన్సులేట్ అధికారుల‌నే క‌లిసి ఆంధ్రాలో నిర్వ‌హించేలా ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. ఒప్పుకుంటే అమ‌రావ‌తి లేదా విశాఖ‌లో దీనిని నిర్వ‌హిస్తామ‌ని అన్నార‌ట‌. కానీ అమెరికా మాత్రం హైద‌రాబాద్ లో నిర్వ‌హించేందుకే మొగ్గుచూపింద‌ట‌. అమ‌రావ‌తిలో జరిగితే అమెరికా కంపెనీల‌ను ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని భావించార‌ట‌. కానీ బాబు ప్ర‌య‌త్నాలు

మ‌న ప్ర‌ధానితో ఇవాంకా

గ్లోబల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్ (జీఈఎస్)లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ మెట్రో రైలు ప్రారంభోత్సవం తర్వాత నేరుగా హెచ్‌ఐసీసీకి వెళ్లిన మోదీ.. మొదట ఇవాంకాతో సమావేశమయ్యారు. ఇవాంకా, మోదీతోపాటు రెండు దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇవాంకా అంతకుముందు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తోనూ భేటీ అయ్యారు.