ఆట‌..మాట‌ల మ‌ధ్య “ఏమి సేతురా“ పాట

ఆట‌..మాట‌ల మ‌ధ్య ``ఏమి సేతురా`` పాట

సినిమాకు క్లాప్ కొట్టినప్పటినుంచీ.. విడుద‌ల చేసే వ‌ర‌కూ ప్ర‌తీ సంద‌ర్భమూ ప్ర‌మోష‌న్‌కు ఉప‌యోగించుకోద‌గ్గ‌దే. పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ల‌ను ఒక రేంజ్‌లో చేస్తారు. సినిమా ప్ర‌చారం వినూత్న పంథాలో సాగుతున్న నేటికాలంలో ప్ర‌మోష‌న్స్ కోసం ఎన్నోకార్య‌క్ర‌మాలు, వ్య‌య‌ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు.  ఈ ట్రెండ్‌కు భిన్నంగా బిగ్‌బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ విన్న‌ర్ శివ‌బాలాజీ తాను హీరోగా న‌టించిన సినిమా “ స్నేహ‌మేరా జీవితం“ ఆడియో విడుద‌ల‌ను వినూత్నంగా, అతిసామాన్యంగా చేస్తున్నారు. ఒక్కో పాట విడుద‌ల‌కు ఒక్కో ప్ర‌త్యేక‌ సంద‌ర్భాన్ని, ప్ర‌త్యేక‌త‌ను జోడిస్తూ..న‌యా ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

బిగ్‌బాస్ ఫినాలే త‌రువాత ఎక్క‌డ చూసినా శివ‌బాలాజీ టాపిక్కే! హీరోగా ఎన్నో హిట్ చిత్రాలు చేసిన రొమాంటిక్ హీరో, బిగ్‌బాస్ త‌రువాత అంద‌రివాడుగా పేరొందాడు. తెలుగులో ఫ‌స్ట్ సీజ‌న్ విజేత‌గా నిలిచిన శివ‌బాలాజీ , విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. “ స్నేహ‌మేరా జీవితం“మూవీలో మూడో పాట “ఏమి సేతురా లింగా“ను కూడా బిగ్‌బాస్ లుక్ మ‌ధ్య రిలీజ్ చేశారు. ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన బిగ్‌బాస్ టాస్క్ విన్న‌ర్స్‌, అభిమానులు హాజ‌రైన ఓ కార్య‌క్ర‌మంలో సునీల్ క‌శ్య‌ప్ సంగీత‌ద‌ర్శ‌క‌త్వంలో హేమ‌చంద్ర పాడిన  “ఏమి సేతురా లింగా“ పాట‌ను విడుద‌ల చేశారు.

ఆరిఫ‌ర్ స్టూడియో లో “ స్నేహ‌మేరా జీవితం“హీరోల చిట్‌చాట్ జ‌రుగుతోంద‌ని తెలిసి భారీస్థాయిలో అభిమానులు అక్క‌డికి చేరుకున్నారు. శివ‌బాలాజీ, రాజీవ్ క‌న‌కాల‌, స్వప్నమాధురిల మాట‌లు, అభిమానులతో ముచ్చ‌ట్ల మ‌ధ్య పాట రిలీజ్ చేశారు. ఈ మూవీ తొలిపాట “మెల్ల‌గా..మెల్ల‌గా`ను కిస్మ‌త్‌పూర్‌లోని చైల్డ్ హావన్ ఇంట‌ర్నేష‌న‌ల్  ఆర్ఫ‌నేజ్ ఫ‌ర్ కిడ్స్ కేంద్రంలో పిల్లల చేతులమీదగా విడుదల చేశారు. చీక‌ట్ల మ‌ధ్య ఉన్న చిన్నారుల్లో చిరుదివ్వె వెలిగించారు. ఆడుతూ, పాడుతూ అక్క‌డే దీపావ‌ళి పండ‌గను గ‌డిపిన  శివ‌బాలాజీ ..పిల్ల‌ల‌కు కానుక‌లు, స్వీట్లు పంచిపెట్టారు. రెండో పాట “రంగుల రాత్రి“ విడుద‌ల‌ రేడియో సిటీ 91.1లో ఆర్జే పోటుగాడు షోలో శివబాలాజి, రాజీవ్ కనకాల ప్ర‌త్యేక అతిథులుగా హాజ‌ర‌య్యి , రేడియా జాకీలుగా వ్య‌వ‌హ‌రించి  శ్రోత‌ల‌ను అల‌రించుతూ శ్రోతల సమక్షంలో విడుదల చేశారు. ఈ సినిమాకు నిర్మాత‌గా శివ‌బాలాజీ వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, మ‌హేష్ ఉప్పుటూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

(Visited 114 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *