వ‌ర్మ‌కు పోటీగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’

వ‌ర్మ‌కు పోటీగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’

ఎన్టీఆర్ బ‌యోపిక్ సిరీస్ లో మూడో సినిమాను ప్ర‌క‌టించారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన నేప‌థ్యంలో అత‌ని మీద టీడీపీ నేత‌లు విరుచుకుప‌డ్డ విషయం, ఆ సినిమాకు నిర్మాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావ‌డం దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా సందేశం ఉంటుంద‌ని టీడీపీ భావిస్తుంది.

ఈ నేప‌థ్యంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించడం, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జ‌రిగింది. లక్ష్మీపార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావును వీడి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిందనే విషయాలను తెరకెక్కిస్తానని జగదీశ్వరరెడ్డి ప్ర‌క‌టించాడు. ఇది ఏ ప‌రిణామాల‌కు దారితీస్తుందో వేచిచూడాలి.

(Visited 93 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *