ఆ సినిమా ఆడ‌ద‌ని ముందే చెప్పా

ఆ సినిమా ఆడ‌ద‌ని ముందే చెప్పా

ఇక నా జీవితంలో ఎప్పుడూ రీమేక్ లు చేయను అంటూ ఆ మ‌ధ్య కాలంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జ‌యంత్ సి ప‌రాన్జీ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన తీన్మార్ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 2011లో విడుద‌ల‌యిన ఈ సినిమాను బండ్ల గ‌ణేష్ నిర్మించాడు.

అయితే ఆ మాట‌లు ఎందుకు అన్న‌ది తాజాగా జ‌యంత్ సి ప‌రాన్జీ వివ‌ర‌ణ ఇచ్చారు. తీన్మార్ నాకు చేధు అనుభ‌వం మిగిల్చింది. ఆ సినిమాను ఉన్న‌ది ఉన్న‌ట్లు చేయాల్సి రావ‌డంతో అలా జ‌రిగింది. అంత‌కుముందు ల‌క్ష్మీన‌ర‌సింహ‌, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు రీమేక్ లే అయినా తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లు మార్పులు చేశాన‌ని అన్నారు. దీనిలో ఎలాంటి మార్పులు లేక‌పోవ‌డంతో ఆ సినిమా ఆడ‌ద‌ని ముందే తెలుసుకున్నా. ఏదో ట్రై చేద్దాం అన్న‌ట్లు ఆ సినిమాను చేశాన‌న‌ని అన్నారు.

(Visited 254 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *