డామిట్ క‌థ అడ్డం తిరిగిందా

డామిట్ క‌థ అడ్డం తిరిగిందా

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మార్చే ఎపిసోడ్ ఇంకా కొన‌సాగుతుంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆ పార్టీ అధ్య‌క్షుడు, ఆంధ్రా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు లండ‌న్ నుండి రేవంత్ వ్య‌వ‌హారంలో ప‌లు కీల‌క ఆదేశాలు జారీ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. తాను వ‌చ్చే వ‌ర‌కు రేవంత్ హోదాను క‌ట్ చేస్తున్నాన‌ని, ఆయ‌న ఎలాంటి స‌మావేశాలు నిర్వ‌హించినా పార్టీకి సంబంధం లేదు. ఎవ‌రూ వెళ్లొద్ద‌ని, ఆయ‌న‌ను సాధార‌ణ ఎమ్మెల్యేగానే చూడాల‌ని ఆదేశించిన‌ట్లు స‌మాచారం.

అయితే ఇక్క‌డే రేవంత్ వ్య‌వ‌హారం మ‌లుపు తిరిగిన‌ట్లు తెలుస్తుంది. పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా రేపు అసెంబ్లీలో టీడీఎల్పీ స‌మావేశానికి రావాల‌ని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల‌ను రేవంత్ కోరిన‌ట్లు స‌మాచారం. పార్టీలో ఇప్పుడు రేవంత్ తో పాటు ఆర్.కృష్ణ‌య్య‌, సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌లు మాత్ర‌మే ఉన్నారు. రేవంత్ ఆహ్వానం నేప‌థ్యంలో ఉన్న ఈ ఇద్ద‌రూ స‌మావేశానికి వెళ్తారా ? లేదా ? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఫ్లోర్ లీడ‌ర్ తానే అయినందున దీనిని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని రేవంత్ అంటున్నాడు. మ‌రి ఈ విష‌యం ఏమ‌వుతుందో రేప‌టిదాకా వేచిచూడాలి.

(Visited 1,760 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *