రాజ‌గురువు ప్లేటు ఫిరాయించాడా ?

రాజ‌గురువు ప్లేటు ఫిరాయించాడా ?

ఈనాడు అధినేత రామోజీరావు ఆంధ్రా రాజ‌కీయాలలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్ప‌బోతున్నారా ? త‌న మ‌న‌వ‌డి పెళ్లిలో త‌ప్ప ఎన్న‌డూ ఈ మ‌ధ్య‌కాలంలో రామోజీరావు చంద్ర‌బాబు నాయుడుతో క‌నిపించ‌లేదు. చంద్ర‌బాబుకు రాజ‌గురువుగా పేరు గాంచిన రామోజీ రావు గ‌త మూడేళ్ల‌కాలంలో త‌న బ‌ద్ద‌శ‌త్రువు జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. రామోజీరావు కోడలు, జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి అత్యంత స‌న్నిహితులు కావ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం.

ఆంధ్రా చంద్ర‌బాబు నాయుడు పాల‌న అస్త‌వ్య‌స్థంగా ఉంది. అవినీతి రాజ్య‌మేలుతుంది. ఇటీవ‌ల నంధ్యాల ఎన్నిక‌ల్లో అధికార బ‌లంతో బ‌య‌ట‌ప‌డ్డా సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌ర‌మే. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగ‌యినా అధికారంలోకి రావాల‌ని వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వెళ్తున్నాడు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను మ‌రింత పెంచి ఎన్నిక‌ల్లో త‌న గెలుపును సులువు చేసుకునే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ ఉన్నాడు.

ఈ నేప‌థ్యంలో రామోజీరావు ఆశీస్సుల కోసం జ‌గ‌న్ క‌లిశాడ‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల త‌రువాత రామోజీకి దూర‌మ‌యిన చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌జ్యోతి అధినేత రాధాకృష్ణ‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. త‌న ఆశీస్సుల‌తో ఎదిగిన చంద్ర‌బాబు త‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం రామోజీని స‌హ‌జంగా వేధిస్తుండ‌వ‌చ్చు. అందుకే జ‌గ‌న్ కు ఆయ‌న ప్రోత్సాహం ఇస్తున్నాడ‌ని అంటున్నారు. రామోజీ నిజంగానే ప్లేటు ఫిరాయిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు ప‌రిస్థితి ఇబ్బందిక‌ర‌మే.

(Visited 1,174 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *