ఆరునెలల్లో కీల‌క నిర్ణ‌యాలంట‌

ఆరునెలల్లో కీల‌క నిర్ణ‌యాలంట‌

వ‌చ్చే ఆరునెల‌లలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటాన‌ని జ‌న‌సేన పార్టీ అధినేత త‌న పార్టీ ప్ర‌తినిధుల‌తో జ‌రిగిన స‌మావేశాల‌లో వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌లో పార్టీ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదుతో పాటు రెండు రాష్ట్రాల‌లో ప్లీన‌రీ నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

2014 ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అడ‌పాద‌డ‌పా జ‌నంలోకి వ‌స్తున్నారు. ట్విట్ట‌ర్ లో ట్వీట్లు చేస్తున్న ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల‌లో పోటీ చేయం అని ప్ర‌క‌టించాడు. ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో ఇంకో ఆరునెల‌ల త‌రువాత మాత్రం పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి ప‌వ‌న్ సాధించేది ఏముంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

(Visited 186 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *