శ‌త‌మానం భ‌వ‌తి

శ‌త‌మానం భ‌వ‌తి

ఆజాంజాహీ మిల్లు మూత‌తో అడుగున ప‌డ్డ ఓరుగ‌ల్లు కార్మికుల శోభ‌కు వెలుగులు దిద్దే కొత్త చ‌రిత్ర‌కు నేడు శ్రీ‌కారం జర‌గ‌బోతుంది. ఉపాధిలేక ఊళ్లు దాటిన నేత‌న్న‌ల‌కు భ‌రోసా క‌ల్పించే కార్య‌క్ర‌మానికి నేడు శంకుస్థాప‌న జ‌ర‌గ‌బోతుంది. బ‌తుకుదెరువులేక భీవండి, సూర‌త్, షోలాపూర్ ల పాలైన కార్మికులు ఈ మ‌హోత్స‌వానికి త‌ర‌లివ‌చ్చి శ‌త‌మానం భ‌వతి అని దీవించ‌నున్నారు. ఆజాంజాహీ మిల్లుతో కోల్పోయిన వెలుగును మెగా టెక్స్ టైల్స్ పార్క్ తో తిరిగి ర‌ప్పించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం మొద‌లుపెడుతుంది.

దేశంలోనే అతి పెద్ద వ‌స్త్ర‌న‌గ‌రిలో దాదాపు 11 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు పారిశ్రామిక‌వేత్త‌లు ముందుకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. రాబోయే కాలంలో ఇక్క‌డ 1.20 ల‌క్ష‌ల మంది కార్మికుల‌కు ప్ర‌త్య‌క్ష్యంగా, ప‌రోక్షంగా ఉపాధి ల‌భిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మెగా టెక్స్ టైల్స్ పార్కుతో పాటు నాలుగు ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

మెగా టెక్స్ టైల్స్ పార్కుతో పాటు 74 కిలోమీట‌ర్ల ప‌రిధిలో వ‌రంగ‌ల్ చుట్టూ ఔట‌ర్ రింగు రోడ్డును నిర్మించనున్నారు. దీంతో పాటు కాజీపేట్ రైలు వంతెన‌కు, మ‌డికొండ ఐటి పార్క్ లో ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ రెండో ద‌శ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. సాయంత్రం దాదాపు 2 ల‌క్ష‌ల మంది హాజ‌రుకానున్న బ‌హిరంగ‌స‌భ‌కు కేసీఆర్ హాజ‌రుకానున్నారు. టెక్స్ టైల్స్ పార్క్ కోసం ఏర్పాటు చేసిన 1200 ఎక‌రాల స్థ‌లంలో ఈ స‌భ జ‌ర‌గ‌బోతుంది. ఓరుగ‌ల్లు పున‌ర్ వైభ‌వానికి జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాలు విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుందాం.

నాలుగు ప్రాజెక్టుల వివ‌రాలు

-రూ.11వేల కోట్ల పెట్టుబడితో 1.2 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్
-రూ.669.59 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్ తొలిదశ
-రూ.25 కోట్లతో మడికొండ ఐటీపార్కులో ఇంక్యుబేషన్ సెంటర్ రెండో దశ పనులు
-రూ.78 కోట్లతో కాజీపేటలో నిర్మించే మరో ఆర్వోబీ

(Visited 218 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *