కండువా క‌ప్పుకోవ‌డం నిజ‌మే కానీ

కండువా క‌ప్పుకోవ‌డం నిజ‌మే కానీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయం అయింది. ముహూర్తం ఎప్పుడు ? ఎక్క‌డ ? ఎవ‌రి స‌మ‌క్షంలో ? అన్న విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌డం మాత్ర‌మే మిగిలింది. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు రేవంత్ కు మీడియా సాక్షిగా ఆహ్వానం ప‌లుకుతుండ‌గా టీడీపీ నేత‌లు కిక్కురుమ‌న‌డం లేదు.

చంద్ర‌బాబు వ‌చ్చాక అన్నీ ఆయ‌న‌కే చెబుతా. నేను పార్టీ మార‌డం లేదు. మీడియా ఏదో రాసుకుంటే నేను ఎందుకు స‌మాధానం చెప్పాలి అంటున్న రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెర‌వెన‌క పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. అయితే ఆయ‌న వెంట ఆయ‌న ఊహించినంత మంది పార్టీ మారేందుకు సిద్దంగా లేర‌ని తెలుస్తుంది. న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, హైద‌రాబాద్ ల నుండి మెజార్టీ నేత‌లు పార్టీని రేవంత్ తో పాటు వీడుతార‌ని రేవంత్ వ‌ర్గం భావించింది.

అయితే రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు వీరు నిరాక‌రిస్తున్నారు. రేవంత్ భ‌విష్య‌త్ కోసం రేవంత్ ఆ పార్టీలోకి వెళ్తున్నాడ‌ని .. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కే ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయో తెలియ‌దు. ఆయ‌న‌ను న‌మ్ముకుని మేము ఆ పార్టీలోకి వెళ్తే క‌ష్టం అని, తాము కూడా ఇత‌ర పార్టీల‌కు వెళ్తాం కానీ రేవంత్ వెంట కుద‌ర‌దు అని అంటున్న‌ట్లు సమాచారం. ఈ సంగ‌తి ఇలా ఉంచితే చంద్ర‌బాబు వ‌చ్చాక రేవంత్ క‌లిసి ఏం చెబుతాడు ? చ‌ంద్ర‌బాబు ఎలా స్పందిస్తాడు అన్న‌ది ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న ముగిస్తే గానీ తెలియ‌దు.

(Visited 844 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *