కేసీఆర్ గురించి దాదా త‌న పుస్త‌కంలో ..

కేసీఆర్ గురించి దాదా త‌న పుస్త‌కంలో ..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి, ఆయ‌న గొప్ప‌త‌నం గురించి, తెలంగాణ గురించి ఆయ‌న క‌మిట్ మెంట్ మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాసిన ద కొలిష‌న్ ఇయర్స్ (సంకీర్ణ సంవ‌త్స‌రాలు) పుస్త‌కంలో వెలిబుచ్చిన అభిప్రాయం ఇప్పుడు దేశ రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది.

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కాంగ్రెస్ లో కీల‌క‌నేత‌. ఆయ‌న రాష్ట్ర‌ప‌తి కాక‌ముందు 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని స‌మైక్య రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చాయి. రాష్ట్రంలో, కేంద్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చేరింది. యూపీఏ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ఆ స‌మ‌యంలో ప‌ద‌వుల పంప‌కంలో ఎవ‌రికి ఏ మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి అన్న విష‌యంలో కొంత సంధిగ్ధ‌త నెల‌కొంది.

ఈ స‌మ‌యంలో కేసీఆర్ ప్ర‌ణ‌బ్ ను క‌లిసినప్పుడు మాట‌ల సంధ‌ర్భంగా ఏ మంత్రి ప‌ద‌వి కావాలి అన్న చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ అన్న మాట‌ల‌ను ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ త‌న పుస్త‌కంలో వివ‌రించారు. ప్ర‌ణ‌బ్ జీ మీకు తెలుసు. నా ల‌క్ష్యం ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం. మీరు నాకు ఏ మంత్రిత్వ‌ శాఖ‌ను అప్ప‌జెప్పినా సంతోషంగా ఆహ్వానిస్తా. కానీ దేవుని ఆశీస్సుల‌తో ప్ర‌త్యేక తెలంగాణ ఇస్తే ఇంకా సంతోషం అని అన్నార‌ని పేర్కొన్నారు.

సంకీర్ణ ప్ర‌భుత్వాలు కాలం ఏలుతున్న స‌మ‌యంలో నాలుగు ఎంపీ ప‌ద‌వులు ఉంటే కేంద్రాన్ని బెదిరించి ప‌నులు చేయించుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ తెలంగాణ కోసం కేసీఆర్ 2001 నుండి 2014 వ‌ర‌కు ఎంత ఓపిగ్గా ప‌నిచేశారు ? ఎంత త‌ప‌న‌తో ప‌నిచేశారు అన్న విష‌యం దేశంలోనే అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ రాష్ట్ర‌ప‌తి అయిన ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. కేసీఆర్ ల‌భించిన ఈ ప్ర‌శంస ఆయ‌న నిబ‌ద్ద‌త‌కు, నిజాయితీకి అద్దం ప‌డుతుంది.

(Visited 1,288 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *